
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చింతా ప్రభాకర్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనుండగా, ఆయనకు అవసరమైన కార్యాలయ వసతి, సిబ్బంది, జీతభత్యాలు తదితరాలను పరిశ్రమల శాఖ సమకూరుస్తుంది.
2014లో టీఆర్‌ఎస్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతా ప్రభాకర్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన సంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.