chinta prabhakar
-
హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చింతా ప్రభాకర్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనుండగా, ఆయనకు అవసరమైన కార్యాలయ వసతి, సిబ్బంది, జీతభత్యాలు తదితరాలను పరిశ్రమల శాఖ సమకూరుస్తుంది. 2014లో టీఆర్ఎస్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతా ప్రభాకర్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. -
'జగ్గారెడ్డికి బుర్ర సరిగ్గా పనిచేయదు'
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనదైన శైలిలో విమర్శించారు. రాష్ట్రంలో అవగాహన లేని ఎమ్మెల్యే జగ్గారెడ్డి . కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జగ్గారెడ్డి ప్రజల్లో ఉండకపోవడం బాధాకరం. సీఎం కేసీఆర్ కరోనా పై తీసుకుంటున్న చర్యలను చూసి దేశం మొత్తం హర్షిస్తుంది. కానీ జగ్గారెడ్డికి బుర్ర సరిగా పనిచేయడం లేదు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు.. ఒక సారి కేసీఆర్‌ను పొగుడుతారు.. మరోసారి విమర్శిస్తారు. అంతెందుకు అప్పుడప్పుడు సొంత పార్టీ నేతలను కూడా విమర్శిస్తుంటారు. జగ్గారెడ్డివి అన్ని గాలి మాటలు, తుపాకీ రాముని చేష్టలుగా ఉంటాయి. మా మంత్రులు, ఎమ్మెల్యేలను విమర్శించే స్థాయి ఆయనకు లేదు. కరోనాతో ఆకలితో ఉన్న వారిని ఆదుకుంటున్నది మేము.. రైతుబంధు వంటి పథకాలను దేశంలో వేరే రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా? గాంధీభవన్ లో కూర్చుని ప్రగతి భవన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సంగారెడ్డిలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆయన మీడియా, సోషల్ మీడియాలో ఉంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. సంగారెడ్డికి ఎవరొచ్చినా అడ్డుకుంటానంటున్న జగ్గారెడ్డి అక్కడ ఎప్పుడైనా ఉన్నాడా అని నేను ప్రశ్నిస్తున్నా. కరోనా వైరస్ సోకుతుందన్న ప్రాణ భయంతోనే ఆయన సంగారెడ్డికి రావడం లేదు. ఉచిత సలహాలు ఇవ్వడం మాని సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడం నేర్చుకో. జగ్గారెడ్డి పై సంగారెడ్డి ప్రజలు తిరుగుబాటు చేసే సమయం త్వరలోనే వస్తుందంటూ' ధ్వజమెత్తారు. (లాక్డౌన్ : 100 కోట్లకు వడ్డీ చెల్లించండి) -
‘సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడారు’
సాక్షి, సంగారెడ్డి : మంత్రి హరీశ్‌రావుకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుసంస్కారంతో మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విమర్శించారు. సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడరన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సదాశివపేట మున్సిపాలిటీలలో మంత్రి హరీశ్‌రావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే జగ్గారెడ్డి ప్రజలు తలదించుకునే విధంగా మాట్లాడరని విమర్శించారు. సదాశివపేటలో జగ్గారెడ్డి కూతురు ప్రచారానికి వెళితే కూడా ఓటర్లు నిలదీస్తున్నారని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసమే జగ్గారెడ్డి అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తే జగ్గారెడ్డికి సింపతి వస్తుందని భ్రమపడుతున్నారన్నారు. తులసి వనంలో గంజాయి మొక్క జగ్గారెడ్డి సంగారెడ్డ ప్రజలకు తలవంపులు తెచ్చేవిధంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు వస్తున్న ఆదరణను చూసి జగ్గారెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మంత్రి పట్ల జగ్గారెడ్డి వాడిన భాషకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలా జగ్గారెడ్డి వ్యవహారం ఉందన్నారు. సంగారెడ్డి ప్రజలకు తలవంపులు తెస్తున్న జగ్గారెడ్డికి మున్సిపాలిటీ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. -
'స్థానికుడై ఉండి అభివృద్ధి చేయలేకపోయారు'
సాక్షి, సంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్థానికుడై ఉండి సదాశివపేటను ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సదాశివపేటలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు రూ. 120 కోట్లతో సంగారెడ్డిలో మంజీర నీటిని ఇంటింటికి సరఫరా చేశామని గుర్తుచేశారు. దీంతో పాటు సదాశివపేటలోనూ పైప్‌లైన్ పనులను తాను ప్రారంభించానని, కానీ ఆ పనులను ప్రభాకర్ పూర్తి చేయలేకపోయారని పేర్కొన్నారు. సదాశివపేట పట్టణంలో ఆసుపత్రి నిర్మించాలని శిలాఫలకం వేస్తే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఊరికి అవతల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వం మాది కాకపోవడంతో నిధుల కోసం వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. అభివృద్ధి సమస్యలనే ప్రధాన ఎజెండాగా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు సాగాలని జగ్గారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడి 26 వార్డుల్లో 18 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి : మున్సి‘పోల్స్’కు సిద్ధమే) -
‘జగ్గారెడ్డిని జనాలు ఈసడించుకుంటున్నారు’
సాక్షి, సంగారెడ్డి : ప్రజలకు సేవ చేయకుండా అవినీతి, అక్రమాలు చేసిన జగ్గారడ్డిని చూసి జనాలు ఈసడించుకుంటున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కోసం జగ్గారెడ్డి మాయ మాటలు చెబుతున్నాడని మండి పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రజలకు కనీసం అందుబాటులో లేకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరం అన్నారు. సింగూరు ప్రాజెక్ట్ గురించి జగ్గారెడ్డి ప్రతిసారి అవాస్తవాలే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులను విమర్శించే హక్కు జగ్గారెడ్డికి లేదని తెలిపారు. తన అవినీతి అక్రమాలపై జగ్గారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రభాకర్ ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సింగూరు ప్రాజెక్ట్ ఎండిపోవడం మామూలే అన్నారు. గతంలో 2005, 2008, 2015లో సింగూర్ పూర్తిగా ఎండిపోయిందని గుర్తు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సమర్థులైన నాయకులను నిలబెడతాం అన్నారు. జగ్గారెడ్డి, హరీశ్ రావు కాలి గోటికి ఉన్న దుమ్ముతో సమానం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, చింత ప్రభాకర్‌లపై విమర్శలు చేస్తే గెలుస్తాను అనుకోవడం జగ్గారెడ్డి ముర్ఖత్వం అన్నారు ప్రభాకర్. -
‘నీ అంతటి నీచ చరిత్ర మరో నాయకుడికి లేదు’
సాక్షి, సంగారెడ్డి : సింగూరు నీటిని హరీష్‌రావు దొంగిలించారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్నేతలు నిప్పులు చెరిగారు. జగ్గారెడ్డి విమర్శలపై టీఆర్ఎస్ నేతలు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజమణి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. 'జగ్గారెడ్డి తీరుతో ఎందుకు గెలిపించామా అని సంగారెడ్డి ప్రజలు ఆవేదన పడుతున్నారు. జగ్గారెడ్డి వ్యవహారం చూసి పిచ్చి వాడిని గెలిపించాము అని సంగారెడ్డి ప్రజలు భావిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నాడు. నీటి సమస్యలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంటే, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం. నీకు జనాలు ఓట్లు వేసి ఏం లాభం. జగ్గారెడ్డి ముమ్మాటికీ చెల్లని రూపాయి. ఎమ్మెల్యేగా గెలవగానే, తెలంగాణకు ద్రోహం చేశావు. ఈదులనాగులపల్లి, ధర్మసాగర్, కంది, చేర్యాలలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి అమ్ముకున్నావు. ఇంతటి నీచ చరిత్ర రాష్ట్రంలో మరో నాయకునికి లేదు. తప్పని పరిస్థితిలో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రైతులను కాపాడాలనే ఉద్దేశంతో నీటిని విడుదల చేశారు. ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రోత్సహిస్తే ఉక్కుపాదం కింద నలిగిపోక తప్పదు. జగ్గారెడ్డి ఎన్ని జన్మలు ఎత్తినా హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని అడ్డుకోలేవు. కేసులు, శిక్షల నుంచి తప్పించుకోవడానికే జగ్గారెడ్డి కేసీఆర్‌ను పొగుడుతున్నాడు' అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మండిపడ్డారు. 'జగ్గారెడ్డి గత కొన్ని నెలలుగా ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావుపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి గెలుపొందిన జగ్గారెడ్డి వాటిని నెరవేర్చకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాను చేసిన నేరాలకు జైలుకు వెళ్ళక తప్పదనే భయంతోనే జగ్గారెడ్డి హరీష్ రావు మీద విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం హరీష్ రావు చేసిన కృషి నువ్వు చేసిన నిర్వాకాలు అందరికి తెలుసు. కార్గిల్ యుద్ధ సమయంలో కార్గిల్ అమరవీరుల కోసం డబ్బులు వసూలు చేసి వాటిని స్వాహా చేసిన చరిత్ర జగ్గారెడ్డిది. సరిహద్దులో సైనికులు ఉండి శత్రువులతో పోరాడుతుంటే నువ్వు అక్రమంగా గుజరాత్ మహిళను అమెరికాకు తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చావు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశావు. ప్రజాసేవను వదిలిపెట్టి ఇటువంటి విమర్శలు చేస్తూ కాలం గడిపితే చరిత్రలో పుట్టగతులుండవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంవత్సరానికి 7టీఎంసీల నీటిని హైద్రాబాద్‌కు తరలించారు. అప్పుడు ఎందుకు స్పందించ లేదు. రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అందుకే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. శిక్షల నుంచి తప్పించుకోవడానికి నిష్కలంకమైన హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నావు. కాళేశ్వరం నుంచి సింగూర్‌ను నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎక్కువ నీరు ఉన్న దగ్గరి నుంచి అవసరం ఉన్న ప్రాంతాలకు తరలిస్తారు. కృష్ణ, గోదావరిలోంచి నీటిని హైదరాబాద్ తాగునీటి కోసం తరలిస్తున్నారు. దీన్ని అక్కడి ప్రజలు అడ్డుకుంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటి. చట్ట సభల్లో కూర్చొని జగ్గారెడ్డి గల్లీ నాయకునిలా వ్యవహరిస్తున్నాడు. గల్లీ రాజకీయాలపై ఆసక్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చెయ్యి. ప్రజా ఆదరణ ఉన్న నాయకులను విమర్శించి జగ్గారెడ్డి వికృత ఆనందం పొందుతున్నాడు. జగ్గారెడ్డి తన చర్యలతో సంగారెడ్డి నియోజకవర్గానికి నష్టం చేస్తున్నాడు' అని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పేర్కొన్నారు. 'జగ్గారెడ్డి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసింది ఏం లేదు. హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగదు. ఎమ్మెల్యేగా వీలైతే అభివృద్ధి చెయ్యాలి. లేకపోతే మా ప్రభుత్వమే అభివృద్ధి చేసుకుంటుంది' అని జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి అన్నారు. కాగా, సింగూరు నీటిని హరీష్‌రావు దొంగిలించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. హరీష్‌రావు ఆదేశాల మేరకే సింగూరు నీటిని నిజాంసాగర్‌కు తరలించారని విమర్శించారు. నీటిని తరలిస్తుంటే ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సింగూరుపై హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. -
అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ ఎజెండా
మండిపడిన టీఆర్ఎస్ నేతలు కర్నె, చింతా ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి ని అడ్డుకోవడమే కాంగ్రెస్ ఎజెండా అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. పాలమూరులో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల కు అడ్డుపడుతుంటే రంగారెడ్డి జిల్లాలో అదే పార్టీ నేతలు ప్రాజెక్టులు కావాలంటూ పాదయాత్రలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ తాండూర్ బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. భూదందాలు, అరాచకాలు చేసిన కాంగ్రెస్‌లో ఉంటూ సంపత్ విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ‘వ్యవ సాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అన్న సంగతి కాంగ్రెస్ నేతలకు తెలియదా? ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలకు ఈ విషయాలు తెలిసీ ధర్నాలు చేస్తున్నారా? నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగానికి కంపెనీలతో నష్ట పరిహారం ఇప్పించిన విషయం వారు మరిచిపోయారా? ఖమ్మంలో జీవ అనే కంపెనీతో రూ. కోటి నష్ట పరిహారం ఇప్పించలేదా’ అని నిలదీశారు. -
'జగ్గారెడ్డి పిచ్చివాడు.. వెళ్లగొడతాం'
సంగారెడ్డి: మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పిచ్చివాడని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే సంగారెడ్డి నుంచి పారదోలుతామని హెచ్చరించారు. 2004లో టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తి జగ్గారెడ్డి అని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు భూస్థాపితం చేస్తారని అన్నారు. సంగారెడ్డి అభివృద్ధిపై మాట్లాడే హక్కు జగ్గారెడ్డికి లేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. కొమురవెల్లి మల్లన్నసాగర్ ముంపు బాధితులకు గురువారం సంఘీభావం తెలిపిన జగ్గారెడ్డి.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇన్నాళ్లు ఆంధ్రోళ్లు తెలంగాణను దోచుకుంటున్నారని ప్రజలను రెచ్చగొట్టిన కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటోందని ధ్వజమెత్తారు. రైతుల భూములను బలవంతంగా గుంజుకోవడం దుర్మార్గమన్నారు. -
యువతతో స్వయం సహాయక సంఘాలు
- సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం - పైలట్ ప్రాజెక్ట్ కింద సదాశివపేట మండలం ఎంపిక సదాశివపేట రూరల్ :విధానంలో భాగంగా యువత కోసం వినూత్న పథకాలు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యువజన సంఘాలు, అధికారులు, జాతీయ యువజన అవార్డు గ్రహీతల అభిప్రాయాలు సేకరించింది. యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మండల స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. యువజన సంఘాలు, రక్తదాన శిబిరాలు, అవయవ దానాల పై అవగాహన సదస్సులు, మొక్కలు నాటే కార్యక్రమం హరితహారం, స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ భారత్, మిసన్ కాకతీయ, యోగా స్పోర్ట్స్, సాంస్కతి కార్యక్రమాలు నిర్వహించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వనుంది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జిలా, మండల స్థాయిలో అవార్డులను ఇచ్చి ప్రోత్సహించనుంది. సోషల్ మీడియా ద్వారా.. యువజన సంఘం వారి పేరు మీద ఫేస్బుక్ క్రియేట్ చేసి అందులో చేసే కార్యక్రమాలను పొందుపరిచారు. అలాగే ఈ-మెయిల్ ఐడీని సైతం క్రియేట్ చేయాలి. ప్రతి మండలానికి మండల పరిషత్ అధికారి మండల యువజన అధికారిగా వ్యవహరించనున్నారు. ఇకనుంచి యువజన వ్యవహారాలన్నీ మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు చూస్తారు. యువజన భవనాల నిర్మాణం... యువత సంస్థాగత తోడ్పాటు కోసం దేశంలో తొలిసారిగా యూత్ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధుల నుంచి ఈ భవనాలను నిర్మించేందుకు వెసులుబాటు కల్పించింది. అందులోనే మల్టీలెవల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు, గ్రంథాలయం ఉపయోగపడే విధంగా నిర్మించనున్నారు. యువతకు స్థానిక చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. యువతకు మీ సేవ కేంద్రాలను కేటాయించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. యువజన సంఘ సభ్యులకు ప్రమాద బీమా కల్పించేందుకు నివేదిక రూపొందిస్తున్నారు. సదాశివపేట మండలం ఎంపిక... జిల్లాలో యువచేతన కార్యక్రమంలో భాగంగా 11 మండలాలను ఎంపిక చేశారు. అందులో సదాశివపేట మండలం ఎంపికైంది. ఈ మండలాల్లో పథకం విజయవంతమైతే దశలవారీగా విస్తరించనున్నారు. మండలాల వారు రిజిస్ట్రేషన్ యాక్టు ప్రకారం యూత్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. బ్యాంకు ఖాతా యువజన సంఘం పేరు మీదే ఉండాలి. క్లబ్‌లోని సభ్యులంతా 18 నుంచి 35 సంవత్సరాల వారై ఉండాలి. యువజన సంఘాలను పాతవైనా, కొత్తవైనా సంబంధిత గ్రామ కార్యదర్శి ద్వారా మండల అభివద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. మరిన్ని వివరాలకు జిల్లాలోని సంగారెడ్డి జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. యువతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం యువత సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. యువత తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. యువత కోసం అనేక పథకాలను అమలు చేయనుంది. సేవా కార్యక్రమాలను నిర్వహించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేయాలని పరిశీలిస్తోంది. మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో 11 మండలాలను ఎంపిక చేశారని, వీటిలో సదాశివపేట మండలం ఎంపిక కావడం మండల యువతకు వరమన్నారు. -
ఏసీబీ ఆఫీసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నవేళ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు హైదరాబాద్ లోని ఏసీబీ కార్యాలయానికి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మెదక్ జిల్లా సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. కేవలం వ్యక్తిగత పనుల నిమిత్తమే తాను ఏసీబీ ఆఫీసుకు వచ్చానని మీడియా ప్రతినిధులతో చెప్పిన చింతా.. మరిన్ని ప్రశ్నలకు బదులు చెప్పేందుకు నిరాకరించారు. ఓటుకు నోట్లు కేసులో ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన ఏసీబీ.. తాజాగా ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయిన వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీరర్తన్ను బుధవారం విచారించింది. కాగా, టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు కొద్దిమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకున్నారనే ఆధారలు సేకరించిన ఏసీబీ.. వారిని కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరిని ప్రశ్నిస్తారనే విషయం తేలకముందే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ఏసీబీ ఆఫీసుకు రావడం రాజకీయవర్గాల్లో గుబులు రేపింది. -
విఐపి రిపోర్టర్ - సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
-
నేనూ పేదింటి బిడ్డనే...
నిత్యం నియోజకవర్గ ప్రజల అర్జీలస్వీకరణ.. అధికారులతో సమీక్షలు.. పార్టీ నాయకుల, కార్యకర్తలతో భేటీలు.. బిజీబిజీగా గడిపే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. ఆదివారం సాయంత్రం మాత్రం అన్నీ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. అధికారులతో తర్వాత మాట్లాడతానంటూ ఫోన్లు బందు పెట్టుకున్నారు. తనను ఆదివారం కలవద్దంటూ పార్టీ కార్యకర్తలకు కరాఖండిగా చెప్పేశారు. సాయంత్రం 5 గంటలకు సాధారణ వ్యక్తిలా వాహనం దిగి ‘సాక్షి’ మైక్ పట్టుకుని సంగారెడ్డిలో మహిళా డిగ్రీ కళాశాల పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ, బీసీ హాస్టల్ వైపు అడుగులు వేశారు. ‘నేనూ పేదింటి బిడ్డనే...ప్రభుత్వ పాఠశాలలోనే సదువుకున్నా... బలహీనవర్గానికి చెందిన నాకు పేదల బతుకులు తెలుసు’.. హాస్టల్ పిల్లల కష్టాలు, కడగండ్లు తెలుసుకునేందుకే ‘సాక్షి’ తరఫున విలేకరిగా వచ్చా... చెప్పండి మీ సమస్యలేమిటో.. అంటూ విద్యార్థులతో మాట్లాడారు. హాస్టళ్లలోనే నిద్రిస్తా... రూపు రేఖలు మారుస్తా చాలా హాస్టళ్లలో సమస్యలు ఉన్నమాట వాస్తవం. హాస్టల్లోని సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో అన్ని హాస్టళ్లలో రాత్రి బస చేస్తా. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్‌రావు దృష్టికి హాస్టల్ సమస్యలను తీసుకెళ్లి వాటి రూపురేఖలు మారుస్తా. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి హాస్టల్లో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయిస్తా. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా. విద్యార్థులు కోరిన విధంగా కాస్మొటిక్ చార్జీల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా. పదో తరగతి విద్యార్థుల కోసం హాస్టల్లలో ప్రత్యేకంగా స్టడీ రూం, లైబ్రరీలు ఏర్పాటుకు చర్యలు చేపడతా. నూతన హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. -చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సంగారెడ్డి చింతా ప్రభాకర్: అమ్మా.. నీ పేరేంటీ, ఎంతకాలం నుంచి హాస్టల్లో ఉంటున్నావు, ఏమైనా సమస్యలున్నాయా? మౌనిక: సార్ నేను మూడేళ్లుగా ఇదే హాస్టల్లో ఉంటున్నా. ఒకే ప్రాంగణంలో మూడు హాస్టల్లు ఉండటంతో ఇబ్బంది పడుతున్నాం. నీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఉంది. చింతా ప్రభాకర్: మీ హాస్టల్‌కు మంజీరా వస్తోంది కదా...అయినా నీటి సమస్య ఉందా? శ్రవంతి (9వతరగతి): తాగునీటికి నీటి ఇబ్బంది లేదు సార్..కానీ ఇతర అవసరాలకు నీళ్లు సరిపోవటంలేదు. మూడు హాస్టల్ళ్లలోని 240 మంది విద్యార్థులకు ఒకే బోరు ఉంది. నీటికి ఇబ్బంది పడుతున్నాం. ఒక బోర్ వేస్తే మా సమస్య తీరుతుంది. చింతా ప్రభాకర్: హాస్టల్లో భోజనం ఎలా ఉంది. మెనూ ప్రకారం వేళకు టిఫన్, భోజనాలు పెడుతున్నారా? భవానీ: మెనూ ప్రకారం భోజనం, టిఫిన్ పెడుతున్నారు సార్.. అయితే నాణ్యత ఉండటం లేదు. బియ్యం దొడ్డుగా ఉండటంతో తినటానికి ఇబ్బంది పడుతున్నాం. సన్న బియ్యం అన్నం పెట్టేలా చూడండి. చింతా ప్రభాకర్: ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, కరెంటు బాగానే వస్తోందా? సమర్పణ: ఎస్సీ -ఏ, ఎస్సీ- బీ హాస్టళ్లతోపాటు బీసీ బాలికల హాస్టల్ ఈ మూడు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నాము. హాస్టల్లను వేరు చేసి ఇతర భవనాల్లోకి మారిస్తే అందరు విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కరెంటు సమస్య ఉంది. కరెంటు పోతే కొవ్వొత్తులు వెలిగించుకుంటాం. (పక్కనే ఉన్న బీసీ హాస్టల్ వార్డెన్ కవితతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ‘ఏమ్మా బాలికల హాస్టల్లో కరెంటు పోతే కొవ్వొత్తుల వెలుగులపై ఆధారపడితే ఎలా..ఇన్వర్టర్ సదుపాయం లేదా’ అంటూ ప్రశ్నించారు. ‘‘ ఇన్వర్టర్ సదుపాయం మాకు లేదు సార్ ...ఇక్కడే కాదు ఏ హాస్టల్‌కు అలాంటి సదుపాయం కల్పించలేదని ఆమె సమాధానమిచ్చారు. దీంతో హాస్టళ్లలో ఇన్వర్టర్ ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ చింతా ప్రభాకర్ హామీ ఇచ్చారు) చింతా ప్రభాకర్: ఏమ్మా చిన్నారి..నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అంటూ మూడవ తరగతి విద్యార్థి మౌనికను అప్యాయంగా ప్రశ్నించారు. బి.మౌనిక: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను చూసి భయం..భయంగా...సిగ్గుపడుతూ ఉహూ.. పెద్ద సమస్యలు ఏమీ లేవు. అయితే బోరు పాడైంది అంటూ సమాధానం ఇచ్చింది. (నీ కష్టం తీరుస్తాలే చిన్నారి అంటూ మౌనిక బుగ్గలను చిదుముతూ అప్యాయంగా చెప్పారు ఎమ్మెల్యే చింతా)ఎస్సీ హాస్టల్ నుంచి బీసీ హాస్టల్ వైపు అడుగులు వేస్తూ చింతా ప్రభాకర్ పక్కనే ఉన్న విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించారు. ఆ తర్వాత బీసీ హాస్టల్ వైపు కదిలి అక్కడ బయట ఉన్న విద్యార్థులను పలకరించారు. చింతా ప్రభాకర్: ఏమ్మా..ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందా? అన్నీ వసతులు బాగున్నాయా? మమత: అంతా బాగుంది సార్. సమయానికి భోజనం పెడుతున్నారు. కానీ, మాకు నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించండి. చింతా ప్రభాకర్: మీకు ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేస్తున్నారు..?హాస్టల్‌కు డాక్టర్ వచ్చి పరీక్షిస్తున్నారా? సునీత: ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వ చ్చి పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. ఎప్పుడైనా ఆరోగ్య సమస్య వస్తే ఆస్పత్రికి వెళ్తున్నాము. చింతా ప్రభాకర్: మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే ధైర్యంగా చెప్పండి? సరస్వతి: సార్..ఈ హాస్టల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సరైన సంఖ్యలో మరుగుదొడ్లు, బాత్రూంలు లేవు. మాకు మంచి సదుపాయాలు కల్పించి సమస్యలు పరిష్కరించండి. సంధ్య: సరైన ఫర్నీచర్ లేదు. స్టడీచైర్స్ లేవు. బెడ్స్ కావాలి. చలితో ఇబ్బంది పడుతున్నాం. మందంగా ఉన్న దుప్పట్లు సరఫరా అయ్యేలా చూడండి సార్. స్టడీ మెటీరియల్..స్పోకెన్ ఇంగ్లీషు కోచింగ్ కావాలే అనంతరం హాస్టల్లోని పదవ తరగతి విద్యార్థులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు ఇలా తెలుసుకున్నారు. చింతా ప్రభాకర్: ఏమ్మా.. మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా. పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సుమలత: సార్ పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ కావాలని ఉన్నా...మాకు ఇంకా అవసరమైన స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. స్టడీ మెటీరియల్ అందక ఇబ్బందులు పడుతున్నాము. శ్రవంతి: పరీక్షలు దగ్గర పడుతున్నా ఏడు సబ్టెక్టులకు సంబంధించి ఇంకా స్టడీ మెటిరియల్ ఇవ్వలేదు. స్టడీ మెటిరీయల్ ఇప్పించేలా చర్యలు తీసుకోండి. (స్టడీ మెటీరియల్ అందకపోవటానికి గల సమస్యను వార్డెన్లతో ఎమ్మెల్యే ఆరా తీశారు. సమస్య పరిష్కారానికి అప్పటికప్పుడు ఆదేశించారు) చింతా ప్రభాకర్ : పదవ తరగతి విద్యార్థులకు ఇంకా సమస్యల ఉన్నాయా? సిద్దమ్మ: సార్.. మాకు స్టడీ మెటీరియల్‌తోపాటు హాస్టల్లో స్పోకెన్ ఇంగ్లీషులో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది. అలాగే మాకు అందజేస్తున్న కాస్మోటిక్ చార్జీలు సరిపోవటంలేదు. కాస్మొటిక్ చార్జీలను రూ.75 నుంచి రూ.150 వరకు పెంచేలా చూడండి. ఆర్.సోనీ: సార్... మా హాస్టల్లో ప్రత్యేకంగా స్టడీ రూం. లైబ్రరీ ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. -
మారండి.. మార్చండి
జిల్లా ఆస్పత్రి సిబ్బంది పనితీరులో మార్పు రావాలని, హాస్పిట ల్లో సరైన సేవలు అందడం లేదంటూ ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని చెరిపేయాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా సూచించారు. వైద్యులు, స్టాఫ్‌లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు. డాక్టర్లను దేవుళ్లుగా భావించి వైద్యం కోసం దవాఖానకు వచ్చే నిరుపేదలకు మెరుగైన చికిత్సలు చేయాలని జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి కోరారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా అన్నారు. ఆయన అధ్యక్షతన మంగళవారం పట్టణంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ ప్రథమ పౌరురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సమాచారం అందించారా..? అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్‌ను ప్రశ్నించారు. దీనిపై తడబడ్డ ఆయన సమాధానం దాటవేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్సలు అందించడానికి అవసరమైన మందులు, పరికరాలు, సిబ్బంది వివరాలను వివరాలను ఈ నెల 16 లోపు తనకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయని, ఈ అపవాదును తొలగించడానికి ప్రతిఒక్క రూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని, కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసినందున సబ్ కాంట్రాక్ట్‌ను తొలగించి టెండర్లు పిలవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మరుగుదొడ్ల మరమ్మతులు, సీసీ కెమెరాల మంజూరు, 250 పడకల ఆస్పత్రిని 500 పడకల స్థాయికి పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు అవసరమైన వివరాాలపై నివేదికలు తెప్పించుకుని ఇవ్వాలని డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, ఎన్ఆర్హెచ్ఎం డీపీఓలకు సూచించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రిలో బయోమెట్రిక్ సిస్టమ్, హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీ, రూఫ్ లీకేజీ మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈఈ రఘును ఆదేశించారు. ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో వెంటీలెటర్లను అమర్చుకోవాలని, ఎంతమంది సిబ్బంది అవసరమో తెలియజేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన కోసం రూ.5 లక్షలను ఎన్హెచ్ఎం నిధులను ఖర్చు చేసేందుకు కమిటీ ఆమోదించింది. జడ్పీ చైర్ పర్సన్ రాజమణి మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులతో ప్రేమతో మాట్లాడి వారికి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యే అసహనం... డిప్యూటీ సీఎం పర్యటించి ఆస్పత్రి సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజునే సమయపాలన పాటించకపోవడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్లో మార్పు రాకుంటే శాఖ పరమైన చర్యలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల కో-ఆర్డినేటర్ నరేంద్రబాబు, ఆర్ఎంఓ మురహరి, డీఎమ్‌అండ్‌హెచ్‌ఓ బాలాజీ పవార్, ఎన్హెచ్ఎం డీపీఓ జగన్నాథరెడ్డి, టీఎస్ ఎస్ఎమ్ఐడీసీ రఘు, జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ గయాసొద్దీన్, వివిధ విభాగాల డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్డుల సందర్శన... జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని వివిధ విభాగాలను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మంగళవారం ఉదయం సందర్శించారు. ఓపీ యూనిట్‌ను, ఇన్ బర్న్, ఔట్ బర్న్, వార్డులను గైనిక్, శిశుసంజీవని, ఎన్ఆర్సీ యూనిట్లు, ఐసీయూ యూనిట్లను పరిశీలించారు. -
దసరా వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, సంగారెడ్డి: దసరా పండుగను పురస్కరించుకుని పట్టణాలు, పల్లెలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నవరాత్రోత్సవాలలో భాగంగా దేవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే సంగారెడ్డిలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో విశ్వహిందూ పరిషత్ దసరా వేడుకలను నిర్వహిస్తోంది. వేడుకల్లో భాగంగా సంగారెడ్డి పట్టణమంతా విద్యుద్దీపాలతో అలంకరించారు. పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్టేడియాన్ని సైతం భారీగా రంగురంగుల దీపాలతో అలంకరించారు. అలాగే భారీ రావణాసురుడి విగ్రహాన్ని రూపొందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటంతోపాటు రావణదహనం నిర్వహించనున్నారు. పటాన్చెరు, గజ్వేల్‌లో ఏర్పాట్లు... పటాన్చెరు, గజ్వేల్, సిద్దిపేట పట్టణాలు దసరా వేడుకలకు ముస్తాబయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో దసరాను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గజ్వేల్ నగరపంచాయతీ ఆధ్వర్యంలో దసరా వేడుకలు జరగనున్నాయి. పటాన్చెరు, అమీన్పూర్, పాశమైలారం.. తదితర పట్టణాలు దసరా వేడుకలకు సిద్ధమయ్యాయి. వేడుకల్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పాల్గొనున్నారు. సిద్దిపేటలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. రావణదహనం చేయనున్నారు. వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొననున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట, మెదక్‌లలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. -
దసరా ఉత్సవాల వివాదానికి తెర పడేనా ?
సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డిలో దసరా నాడు నిర్వహించనున్న ఉత్సవాలు తీవ్ర వివాదాన్ని రేకెత్తిస్తోంది. ఉత్సవాలకు రాజకీయ విభేదాలు కూడా తోడవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించిన వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌పై వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కాదని ఎమ్మెల్యేను ముఖ్యఅతిథిగా పిలవడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. రాంమందిర్ ఉత్సవ కమిటీ, భవానీమందిర్ యువసేన కమిటీ సభ్యుల సూచన మేరకు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపినప్పటికీ వీహెచ్‌పీ నాయకులు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యేను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తే మాత్రం సహించేది లేదన్నారు. దసరా ఉత్సవ కమిటీ నిర్వహించే దసరా వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షత వహిస్తారని, ఎమ్మెల్యే నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి అయినందున ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తామంటే తమకు అభ్యంతరం లేదన్నారు. వారంరోజులుగా దసరా ఉత్సవాలపై వివిధ పార్టీల నాయకులు చేస్తున్న విభిన్న ప్రకటనలతో దుమారం నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ చౌహాన్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఉత్సవాలకు సహాయం చేస్తే తాము కాదమని, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ క్రమంలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరకు దసరా ఉత్సవాలను మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహిస్తామని, ఉత్స వాలకు ఎమ్మెల్యేను కూడా ఆహ్వానిస్తామని వారు పేర్కొన్నారు. ఎప్పటిలాగే రాంమందిర్ నుంచి శావాను ఊరేగింపుగా తీసుకువస్తామని ఉత్సవాన్ని రాజకీయాలకు అతీతంగా, గతంలో మాదిరిగా వైభవంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. -
ఇళ్ల పట్టాల వ్యవహారం మళ్లీ మొదటికి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ సదాశివపేట: ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అట్టహాసంగా పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 5,300 మందికి పట్టాల పంపిణీ చేయగా వీటిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అనర్హులకు, జిల్లాయేతరులకు కూడా పట్టాలిచ్చారని ఇటీవల స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. రెవెన్యూ రికార్డుల నుంచి సేకరించిన ప్రాథమిక ఆధారాలను కూడా ఆయన ముఖ్యమంత్రికి అందజేశారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ పాత పట్టాల కేటాయింపును రద్దు చేసి, తిరిగి అర్హులైన వారికి కొత్త పట్టాలు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌ను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2013లో అట్టహాసంగా పంపిణీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి 2013 అక్టోబర్ 5న సదాశివపేట పట్టణానికి ఆనుకొని ఉన్న సిద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని స్థలాన్ని ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున కేటాయించి 5,300 మందికి పట్టాలను పంపిణీ చేశారు. ఇందుకోసం 160 మంది రైతుల నుంచి 184 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా సేకరించారు. రైతుల ఆధీనంలో ఉన్న ఈ భూమికి ఎకరాలకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారంతో పాటు భూమి కోల్పోయిన వారికి ఇంటి స్థలం ఇచ్చేందుకు రెవిన్యూ అధికారులు అంగీకరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కేవలం రూ. 5.52 కోట్లు మాత్రమే నిధులను మంజూరు చేయడంతో గత అక్టోబర్‌లో ఎకరానికి రూ. 2.56 లక్షల చొప్పున అధికారులు చెల్లించారు. ఒప్పందం మేరకు మిగిలిన డబ్బు కూడా చెల్లించాలని రైతులు ఆందోళన చేస్తుండగానే.. 130 ఎకరాల భూమిలో గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల అధికారులు లే అవుట్‌ను రూపొందించారు. మరో 54 ఎకరాల్లో లేఅవుట్ చేయవలసి ఉంది. ఆది నుంచీ వివాదమే 2007లో కూడా ఈదులవాగు సమీపంలోని ప్రభుత్వ భూమిలో 2,000 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఇక్కడ గృహ నిర్మాణం చేసేందుకు అనువుగా లేదన్న కారణంతో ఈదుల వాగు పట్టాలు రద్దు చేసి వారికి కూడా ఇక్కడే పట్టాలిచ్చారు. ఇక మిగిలిన 3,300 పట్టాల్లో దాదాపు 80 శాతం పట్టాలు అక్రమార్కుల చేతిల్లోకే వెళ్లిపోయినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. 1,300 పట్టాల్లో అప్పటి తహశీల్దార్ శంకరప్ప ఎలాంటి అర్హతా పత్రాలను పరిశీలించకుండా ఎమ్మెల్యే సూచనల మేరకు అనర్హులకు పట్టాలు మంజూరు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీళ్లు కాకుండా సంగారెడ్డి పట్టణం, అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వ్యక్తులు కూడా పట్టాలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పట్టణంలోని 23 వార్డుల పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులకు ఒక్కొక్కరికి 20 చొప్పున ఖాళీ పట్టా సర్టిఫికెట్లను అందజేయగా, వాళ్లు తమకిష్టమైన వారికి, డ బ్బులు ఇచ్చిన వారిపేర్లతో పట్టాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ అక్రమాలపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో వాటిని రద్దు చేయాలని సర్కార్ నిర్ణయించింది. -
ఎన్నికకు వేళాయే!
సంగారెడ్డి డివిజన్: జెడ్పీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా పాలక వర్గాలు కొలువుదీరనున్నట్టు సమాచారం. మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికల కమిషన్ జెడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లతోపాటు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎన్నికై నెల రోజులు కావస్తున్నా ఇంకా కొత్త పాలకవర్గాలు కొలువుదీరలేదు. దీంతో కౌన్సిలర్లు, జెడ్పీటీసీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి నెలకొంది. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకుని క్యాంపులు నడుపుతున్న వారికి క్యాంపుల నిర్వహణ భారంగా మారుతున్నాయి. మరోవైపు షెడ్యూల్ జాప్యంతో క్యాంపులో తమకు మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఎక్కడ జారిపోతారోనన్న ఆందోళనతో ఉన్నారు. ఈ నెల 25 తర్వాత షెడ్యూల్ విడుదల చేసి నెలాఖరు వరకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చూడాలని ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మెజార్టీ జెడ్పీటీసీ సభ్యులు టీఆర్ఎస్కు ఉన్నందునా జెడ్పీ పీఠం ఆ పార్టీకే దక్కే అవకాశాలున్నాయి. జిల్లాలోని మెజార్టీ ఎంపీపీ పదవులను దక్కించుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. ఇందుకోసం పోటాపోటీగా క్యాంపులు నడుపుతున్నాయి. మున్సిపాలిటీల్లో మారుతున్న సమీకరణాలు జిల్లాలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సమీకరణాలు మారుతున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, మెదక్, జహీరాబాద్ మున్సిపాలిటీలతోపాటు జోగిపేట, గజ్వేల్ నగరపంచాయతీలకు చైర్మన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా చోట్ల పాగా వేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. మెదక్ మున్సిపాలిటీ మినహా టీఆర్ఎస్కు మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం లేదు. అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున తమతో కలిసివచ్చే కౌన్సిలర్లను కలుపుకుని చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు అధిక మెజార్టీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాంపులు నిర్వహిస్తూ ఎలాగైనా చైర్మన్ పదవులు సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే సంగారెడ్డిలో ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో, అలాగే సదాశివపేటలోనూ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ మున్సిపాలిటీల్లో 24 స్థానాలకు కాంగ్రెస్ 12 కౌన్సిలర్ స్థానాలను గెలుపొందింది. చైర్మన్ పదవి పొందాలంటే మరొక్క కౌన్సిలర్ అవసరం. అయితే ఎమ్మెల్యే గీతారెడ్డి ఎక్స్అఫీషియో హోదాలో ఓటు వేసే అవకాశం ఉన్నందునా కాంగ్రెస్‌కు చైర్మన్ పదవి దక్కేఅవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ టీడీపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు కలిస్తే వారి సంఖ్య 12 అవుతుంది. టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎక్స్అఫీషియో హోదాలో చైర్మన్ ఎన్నికలో ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడింది. గజ్వేల్ నగరపంచాయతీలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు పలకడంతో ఇక్కడ చైర్మన్ పదవి దక్కించుకోవటం అధికార పార్టీకి నల్లేరుమీద నడకలా మారింది. జోగిపేట నగరపంచాయతీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉన్నందున చైర్మన్ పదవి దక్కే అవకాశాలున్నాయి. కీలకంగా మారనున్న ‘విప్’ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విప్ కీలకంగా మారనుంది. దీంతో ఇతర పార్టీల్లోకి జంప్ చేయాలన్న కౌన్సిలర్లకు విప్ భయం పట్టుకుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో లోపాయికారిగా అధికార పార్టీకి సహకరించాలని అనుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీ కౌన్సిలర్లకు విప్ అడ్డంకిగామారుతోంది. కాంగ్రెస్ పార్టీ విప్‌ను అస్త్రంగా వినియోగించుకోవాలని చూస్తోంది. అయితే విప్ జారీ చేసే అధికారం ఎమ్మెల్యేలకు కట్టబెట్టాలా, డీసీసీ అధ్యక్షునికి ఇవ్వాలా అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం జిల్లా అధ్యక్షులకు విప్ అధికారం కట్టబెట్టాలని యోచిస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని మున్సిపాలిటీల్లో కీలకంగా ఉన్న ఎంఐఎం పార్టీకి విప్ జారీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. -
కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పోటీపడి గెలుపొందిన కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. విలువైన ప్లాటు, కారు ఇచ్చి తమ పార్టీకి మద్దతు ఇచ్చే వారిలో ఒకరికి వైస్ చైర్మన్ ఇస్తామని ఎర చూపుతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాల్టీలో పార్టీ జెండా ఎగరవేయడానికి పోటీ పడి ఇరు పార్టీలు నజరానాలు ప్రకటిస్తున్నాయి. సదాశివపేట మున్సిపల్ పరిధిలోని 13 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌కి చైర్మన్ పదవి దక్కకుండా ఇండిపెండెంటుకు, కాంగ్రెస్‌లోని అసంతృప్తులకు ఎర వేసి తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నశివరాజ్ పాటిల్‌కు పదవి దక్కకుండా ఆయన వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కౌన్సిల్ సభ్యడు చీలమల్లన్న సతీమణిని తెరపైకి తెచ్చి జగ్గారెడ్డి అనుచరుడు సుభాష్‌కు చెక్ పెట్టాలని చింతా ప్రభాకర్ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయనే చెప్పవచ్చు. ఇందుకోసం టీఆర్ఎస్తో పాటు ఎంఐఎం, స్వతంత్రులు, టీడీపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఇందుకోసం ఒక స్థానంలో గెలిచిన బీజేపీ మద్దతు సైతం తీసుకొని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడికి కోఅప్షన్ సభ్యనిగా నియమించేందుకు హమీ ఇవ్వడంతో పేట మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పాగా వేసేందుకు అనూహ్యంగా స్వతంత్ర మహిళా అభ్యరిని చైర్‌పర్సన్‌గా నియమించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం 30, 26వ వార్డులల్లో స్వతంత్ర మహిళా అభ్యర్థులను చైర్ పర్సన్లుగా నియమించేందుకు టీఆర్ఎస్ ఎంఐఎం మద్దతు కోరింది. ఎంఐఎం గెలిచిన స్థానాల్లో బీసీ కేటగిరిలో మహిళలు లేకపోవడంతో మద్దతు ఇచ్చేందుకు ఎంఐఎం సైతం అంగీకరించినట్లు తెలిసింది. 28 వార్డుల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 2 వార్డుల్లో గెలవడం ఆ రెండింటిలో కూడా మహిళా అభ్యర్థి లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చి చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు దక్కకుండా తనదైన వ్యూహరచనతో చింతా ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పక్షాన గెలిచిన నేతల సైతం గతంలోని తమ స్థానాలను నిలుపుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడంతో సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయని చెప్పవచ్చు. స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు ప్రత్యర్థి కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు భారీ నజరానాలు ఎర వేస్తున్నారు. -
తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కల సాక్షాత్కరించటంతో జిల్లాలో మంగళవారం సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్యమ పురిటిగడ్డలో విజయోత్సవ వేడుకలు హోరెత్తాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినవెంటనే తెలంగాణవాదులు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీ జేఏసీ, సీపీఐ, కొన్నిచోట్ల టీడీపీ నాయకులు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. భారీ ఎత్తున టపాసులు కాలుస్తూ, రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. జిల్లావ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. పార్టీల నాయకులతోపాటు ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు వేడుకల్లో పాల్గొన్నారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం, ప్రభుత్వ అతిథి గృహం వద్ద టీఆర్ఎస్ నాయకులు బాణాసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీలకతీతంగా శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీచేశారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. పట్టణ శివారులోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి తెలంగాణవాదుల నివాళులర్పించారు. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సంబరాలు జరుపుకుని మిఠాయిలు పంచిపెట్టారు. ఇస్నాపూర్ చౌరస్తాలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, పటాన్చెరులో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గాలి అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. బీరంగూడ చౌరస్తాలో మండల బీజేపీ నాయకుడు లకా్ష్మరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. జహీరాబాద్‌లో మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి తెలంగాణ నినాదాలు చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సుధీర్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జి గౌని శివకుమార్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు వై.నరోత్తం ఆధ్వర్యంలోనూ సంబరాలు జరుపుకున్నారు. నర్సాపూర్‌లో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరిపారు. మంత్రి అంబేద్కర్ విగ్రహానికిపూల మాల వేసి మిఠాయిలు పంచి పెట్టారు. గిరిజన మహిళల తో కలిసి నృత్యం చేశారు. టీఆర్ఎస్, టీఎన్జీఓస్, బీజేపీ. బీవీఆర్ఐటీ విద్యార్థులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి టపాకాయలు కాల్చారు. కౌడిపల్లిలో, వెల్దుర్తిలో, మాసాయిపేటలో తెలంగాణవాదులు ర్యాలీలు తీసి మిఠాయిలు పంచి పెట్టారు. మెదక్‌లో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీజేఏసీ నాయకులు పట్టణంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత్రావు, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, బీజేపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కటికె శ్రీను నృత్యాలు చేస్తు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు మల్లిఖార్జున్‌గౌడ్, క్రిష్ణా రెడ్డి, హఫీజ్, మేడి మధుసూధన్ రావు, అంజా గౌడ్ పాల్గొన్నారు. జోగిపేటలో, నారాయణఖేడ్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోనూ తెలంగాణ విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. -
బలప్రదర్శన
సంగారెడ్డి టీఆర్ఎస్లో టికెట్ల లొల్లి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ ఎవరికి వారుగా ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎదుట ఇరువర్గాలు ఇటీవల బలప్రదర్శన కూడా చేసినట్లు సమాచారం. గతంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆర్.సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చింతా ప్రభాకర్ తర్వాతి కాలంలో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచే అటు సత్యనారాయణ, ఇటు చింతా ప్రభాకర్ నడుమ విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాతి కా లంలో ప్రభాకర్‌కు నియోజకవర్గ ఇన్చార్జి పదవి అప్పగించడంతో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రభాకర్ నియోజకవర్గానికి దూరంగా ఉండటం, జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణకు పదవి కట్టబెట్టడంతో నియోజకవర్గ టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు కొం తకాలం స్తబ్దుగా ఉన్నాయి. ఇటీవల ప్రభాకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో అంతర్గత విభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్.సత్యనారాయణ తన వాదన వినిపించేందుకు ఓ బృందాన్ని పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఆరేళ్ల పదవీ కాలాన్ని త్యాగం చేసిన వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలంటూ’ ఈ బృందం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్నించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల సదరు బృందంతో కేసీఆర్ భేటీ చివరి నిమిషంలో రద్దయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోమారు కేసీఆర్‌ను కలిసేందుకు సత్యనారాయణ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన ఓ ముఖ్య నేతను పార్టీలో చేర్చేందుకు ఆర్. సత్యనారాయణ మంతనాలు సాగిస్తున్నారు. కేసీఆర్ ఎదుట బలప్రదర్శన ఆర్. సత్యనారాయణ ప్రయత్నాలు పసిగట్టిన టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ తన మద్దతుదారులతో కేసీఆర్ ఎదుట బలప్రదర్శన జరిపారు. ఈ నెల మూడో తేదీన నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు, క్రియాశీల కార్యకర్తలను వెంటబెట్టుకుని కేసీఆర్ వద్దకు వెళ్లారు. ‘సంగారెడ్డిలో పార్టీని బలోపేతం చేయాల్సిందిగా’ సూచించిన కేసీఆర్ పరోక్షంగా ప్రభాకర్‌కు అనుకూలంగా సంకేతాలు ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా టికెట్ ఆశిస్తున్న నేతలను పిలిచి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరు పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి.