
సాక్షి, సంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్థానికుడై ఉండి సదాశివపేటను ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సదాశివపేటలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు రూ. 120 కోట్లతో సంగారెడ్డిలో మంజీర నీటిని ఇంటింటికి సరఫరా చేశామని గుర్తుచేశారు. దీంతో పాటు సదాశివపేటలోనూ పైప్‌లైన్ పనులను తాను ప్రారంభించానని, కానీ ఆ పనులను ప్రభాకర్ పూర్తి చేయలేకపోయారని పేర్కొన్నారు.
సదాశివపేట పట్టణంలో ఆసుపత్రి నిర్మించాలని శిలాఫలకం వేస్తే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఊరికి అవతల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వం మాది కాకపోవడంతో నిధుల కోసం వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. అభివృద్ధి సమస్యలనే ప్రధాన ఎజెండాగా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు సాగాలని జగ్గారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడి 26 వార్డుల్లో 18 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి : మున్సి‘పోల్స్’కు సిద్ధమే)
Comments
Please login to add a commentAdd a comment