సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనదైన శైలిలో విమర్శించారు. రాష్ట్రంలో అవగాహన లేని ఎమ్మెల్యే జగ్గారెడ్డి . కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జగ్గారెడ్డి ప్రజల్లో ఉండకపోవడం బాధాకరం. సీఎం కేసీఆర్ కరోనా పై తీసుకుంటున్న చర్యలను చూసి దేశం మొత్తం హర్షిస్తుంది. కానీ జగ్గారెడ్డికి బుర్ర సరిగా పనిచేయడం లేదు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు.. ఒక సారి కేసీఆర్ను పొగుడుతారు.. మరోసారి విమర్శిస్తారు. అంతెందుకు అప్పుడప్పుడు సొంత పార్టీ నేతలను కూడా విమర్శిస్తుంటారు. జగ్గారెడ్డివి అన్ని గాలి మాటలు, తుపాకీ రాముని చేష్టలుగా ఉంటాయి. మా మంత్రులు, ఎమ్మెల్యేలను విమర్శించే స్థాయి ఆయనకు లేదు.
కరోనాతో ఆకలితో ఉన్న వారిని ఆదుకుంటున్నది మేము.. రైతుబంధు వంటి పథకాలను దేశంలో వేరే రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా? గాంధీభవన్ లో కూర్చుని ప్రగతి భవన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సంగారెడ్డిలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆయన మీడియా, సోషల్ మీడియాలో ఉంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. సంగారెడ్డికి ఎవరొచ్చినా అడ్డుకుంటానంటున్న జగ్గారెడ్డి అక్కడ ఎప్పుడైనా ఉన్నాడా అని నేను ప్రశ్నిస్తున్నా. కరోనా వైరస్ సోకుతుందన్న ప్రాణ భయంతోనే ఆయన సంగారెడ్డికి రావడం లేదు. ఉచిత సలహాలు ఇవ్వడం మాని సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడం నేర్చుకో. జగ్గారెడ్డి పై సంగారెడ్డి ప్రజలు తిరుగుబాటు చేసే సమయం త్వరలోనే వస్తుందంటూ' ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment