'జగ్గారెడ్డి పిచ్చివాడు.. వెళ్లగొడతాం' | kotta prabhakar warns Jagga Reddy | Sakshi
Sakshi News home page

'జగ్గారెడ్డి పిచ్చివాడు.. వెళ్లగొడతాం'

Published Fri, Feb 10 2017 6:36 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

'జగ్గారెడ్డి పిచ్చివాడు.. వెళ్లగొడతాం'

'జగ్గారెడ్డి పిచ్చివాడు.. వెళ్లగొడతాం'

సంగారెడ్డి: మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పిచ్చివాడని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే సంగారెడ్డి నుంచి పారదోలుతామని హెచ్చరించారు. 2004లో టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తి జగ్గారెడ్డి అని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలు భూస్థాపితం చేస్తారని అన్నారు. సంగారెడ్డి అభివృద్ధిపై మాట్లాడే హక్కు జగ్గారెడ్డికి లేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు.

కొమురవెల్లి మల్లన్నసాగర్ ముంపు బాధితులకు గురువారం సంఘీభావం తెలిపిన జగ్గారెడ్డి.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇన్నాళ్లు ఆంధ్రోళ్లు తెలంగాణను దోచుకుంటున్నారని ప్రజలను రెచ్చగొట్టిన కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటోందని ధ్వజమెత్తారు. రైతుల భూములను బలవంతంగా గుంజుకోవడం దుర్మార్గమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement