
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు(శనివారం) యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బేగంపేటలోని ప్రగతి భవన్ నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి బయలుదేరి వెళ్తారు. ఉదయం పదిన్నరకు యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం యాదాద్రి చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు పనులను తనిఖీ చేస్తా రు. తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్, టెంపుల్ సిటీ పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. యాదాద్రిలో మధ్యాహ్న భోజ నం చేసి హైదరాబాద్ బయలుదేరతారు.