
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం మోదుగకుంటకు చెందిన రైతు సోలిపురం రవీందర్ రెడ్డి పెంచుకుంటున్న ఓ మేకకు ఒకరోజు మద్యాన్ని పట్టించాడు. అప్పటినుంచీ ప్రతిరోజూ సాయంత్రంపూట రవీందర్ రెడ్డి మద్యాన్ని తాగినప్పుడల్లా మేక కూడా వచ్చి యజమాని వద్ద నిలబడుతుంది.
దీంతో ప్రతిరోజూ మేకకు మద్యం తాగిస్తుండటంతో దానికి అలవాటుగా మారిపోయింది. మేక మద్యం తాగుతుండటాన్ని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment