చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి | Yadadri Child Pranathi dies at kamineni Hospital | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి

May 12 2019 9:40 AM | Updated on May 12 2019 2:08 PM

Yadadri Child Pranathi dies at kamineni Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన చిన్నారి ప్రణతి చివరకు శాశ్వత నిద్రలోకి చేరుకుంది. ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందింది. కాగా గురువారం యాదగిరిగుట్ట పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద రాచకొండ పోలీసుల వాహనం ఢీకొని ప్రణతి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.  మెదడుకి కూడా బలమైన గాయం కావడంతో పాటు కొన్న అవయవాలు పని చేయకపోవడంతో ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు.వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ప్రణతి కోలుకోవాలని, మెరుగైన వైద్యం అందించడానికి రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ చివరి వరకూ ప్రయత్నించారు. మరోవైపు నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చదవండి: (చిన్నారిపై నుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement