పరువు పోయిందని ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య  | Auto Driver Eliminated Himself In Yadadri Bhuvanagiri District | Sakshi
Sakshi News home page

పరువు పోయిందని ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య 

Published Fri, Apr 30 2021 11:02 AM | Last Updated on Fri, Apr 30 2021 2:38 PM

Auto Driver Eliminated Himself In Yadadri Bhuvanagiri District - Sakshi

ఆలేరు రూరల్‌: పరువు పోయిందని మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిగూడెంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన జన్నె భిక్షపతి (37) వ్యవసాయంతో పాటు ట్రాలీ ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆటో మరమ్మతుకు గురవడంతో ఆలేరులోని ఎస్‌ఎస్‌ ఆటోమొబైల్‌ దుకాణంలో విడిభాగాలను ఉద్దెరపై కొన్నాడు.

అయితే, కొంత బాకీ తీర్చగా, మిగిలింది తీర్చాలంటూ షాపు నిర్వాహకుడు నాగేందర్‌.. గురువారం భిక్షపతిని దూషిస్తూ ఆటోను తీసుకెళ్లాడు. దీంతో తన పరువు పోయిందని మనస్తాపానికి గురైన భిక్షపతి.. ఇంటికి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకు న్నాడు. కాగా, మృతదేహాన్ని ఆటోమొబైల్‌ షాపు ఎదుట ఉంచి మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పరిహారం ఇప్పించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  

చదవండి: రెండ్రోజుల్లో నిశ్చితార్థం: అప్పు తీర్చేవారు లేరని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement