
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రెలగూడెం స్టేజి వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. సూర్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం హైదరబాద్ నుంచి సూర్యపేటకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్లా పడింది. ఈ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. కొందరికి స్వల్పగాయలు కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.