
ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్
సాక్షి, భువనగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ శుక్రవారం తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులో సుమారు 438 ఎకరాల్లో 1500 కోట్ల వ్యయంతో ఇండస్ట్రీయలైజేషన్ జరిగింది. పార్కు నిర్మాణంతో.. పరిసర గ్రామాల్లోని సుమారు 30 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలపడంతో.. ప్రారంభోత్సవం కోసం అక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ప్రారంభోత్సవం రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కలిసి నేడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment