Balamallu
-
గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
సాక్షి, భువనగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ శుక్రవారం తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులో సుమారు 438 ఎకరాల్లో 1500 కోట్ల వ్యయంతో ఇండస్ట్రీయలైజేషన్ జరిగింది. పార్కు నిర్మాణంతో.. పరిసర గ్రామాల్లోని సుమారు 30 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలపడంతో.. ప్రారంభోత్సవం కోసం అక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ప్రారంభోత్సవం రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కలిసి నేడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక ప్రగతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పారిశ్రామిక రంగం గడిచిన ఐదేళ్లలో విప్లవాత్మక ప్రగతిని సాధించిందని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం(టీఎస్–ఐపాస్)తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి సీఎం కేసీఆర్ ఆలోచనలు, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నిర్విరామ కృషే కారణమన్నారు. ఐదేళ్లలో 11 వేల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వ గా, అందులో 8,400 పరిశ్రమలు ఉత్పత్తులు ప్రా రంభించి 12 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని అందిస్తున్నాయని చెప్పారు. శనివారం ఇక్కడి పరిశ్రమల భవన్‌లోని తన కార్యాలయంలో బాలమ ల్లు మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ విధానం ద్వారా రాష్ట్రంలో 8,500 పరిశ్రమలకు అనుమతు లు ఇవ్వడం ద్వారా 1.60 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు 12 లక్షలమందికి ప్రత్యక్షంగా, మరో 20 లక్షలమందికి పరోక్షంగా ఉపాధి దొరికిందన్నారు. 23 ఇండస్ట్రియల్ పార్కులను నెలకొల్పేందుకు అవసరమైన 39,989 ఎకరాలను సేకరించి రూ.1,825 కోట్లతో అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పించినట్లు పేర్కొన్నారు. -
మహిళలు తలచుకుంటే...
ఆర్.కె. ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్, కావ్యారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహిళా కబడ్డీ’. శనివారం రామకృష్ణగౌడ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘మహిళా కబడ్డీ’ పోస్టర్‌ను తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘గౌడ్ నాకు చాలా కాలం నుంచి మిత్రుడు. ఆయన తీస్తున్న ‘మహిళా కబడ్డీ’ చిత్రంలోని పాటలను విన్నాను. ఎంతో బావున్నాయి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని చాటి చెప్పే సినిమా ఇది’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పాటల రికార్డింగ్ పూర్తయింది. గీతా మాధురి, మంగ్లీ, మధుప్రియ లాంటి ప్రముఖ గాయనీ మణులు పాడిన ఆరు పాటలను రికార్డ్ చేసాం. దాంతోపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి కబడ్డీలో జాతీయ స్థాయిలో ఎలా నిలిచింది? ఆమె జర్నీలో ఉన్న సమస్యలు, మలుపులు ఏమిటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్. -
46 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 46 వేల ఎకరాల్లో కొత్త పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు, ముడిసరుకుల లభ్యత ఆధారంగా వివిధ అనుబంధ రంగ పరిశ్రమలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీఎస్ఐఐసీ చేపట్టిన మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు 2019 అత్యంత కీలకమని, ఈ ఏడాదిలోనే ఆ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ మెగా ప్రాజెక్టులపై రూపొందించిన 2019 క్యాలెండర్‌ను గురువారం జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్‌తో కలిసి ఆవిష్కరించారు. -
కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతం: బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: భారీ సాగునీటి, ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో అత్యద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక కాళేశ్వరం ప్రాజెక్టని ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. బాలమల్లు సారథ్యంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయన యాత్రను చేపట్టింది. మేడారంలో జరుగుతు న్న పనులతోపాటుగా పెద్దపల్లి జిల్లాలో గోదా వరి నదిపై నిర్మిస్తున్న అన్నారం బ్యారేజ్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ధర్మారం మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 6 కింద చేపడుతున్న సర్జ్ పూల్, టన్నెల్ నిర్మాణ పనులను ఈ బృందం బుధవారం పరిశీలించింది. ఈ ప్రాజెక్టు పనుల పురోగతి గురించి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లును ఈ బృందం అడిగి తెలుసుకుంది. 9.34 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న డబుల్ టన్నెల్(సొరంగ) నిర్మాణ పనులను, 4,800 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో కూడిన 7 పంపు హౌస్‌లకు సంబంధించిన పనుల పురోగతిని కూడా ఈ బృందానికి వివరించారు. -
మహబూబాబాద్‌లో టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి వలస వెళ్లిన సూరత్ వస్త్ర (పవర్లూమ్) పరిశ్రమల యజమానులు శనివారం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ప్రధాన కార్యాలయంలో చైర్మన్ బాలమల్లును కలిశారు. వస్త్ర పరిశ్రమ క్లస్టర్ ఏర్పాటుకు మహబూబాబాద్‌లో 200 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తాము ఇక్కడ వీరభద్ర స్వామి టెక్స్టైల్ మాన్యుఫ్యాక్చ రర్స్ అండ్ వీవర్స్ వేల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఎంసీపీసీడీఎస్ కింద టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, స్పెషల్ ప్యాకేజీ మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు రిపోర్టును బాలమల్లుకు అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన క్లస్టర్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
యంత్రాల యూనిట్‌కు భూములివ్వండి
సర్కారుకు శక్తిమాన్ ఆగ్రో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి రైతులకు లబ్ధి చేకూ ర్చే ఆధునిక సాగు యంత్రాల యూనిట్ నెలకొల్పేందుకు భూములు కేటాయించా లని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమ ల్లును శక్తిమాన్ ఆగ్రో కంపెనీ ప్రతినిధులు కోరారు. రాష్ట్రంలో భూముల పరిశీలనకు హైదరాబాద్ వచ్చిన కంపెనీ ప్రతినిధులు శుక్రవారం పరిశ్రమ భవన్లో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహా రెడ్డిని కలిశారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. 71 దేశాల్లో తమ కంపెనీ యూనిట్లున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా మని చెప్పారు. రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం ప్రత్యేక ఆసక్తిని కనబర్చిందని, అనుకూలమైన భూములు కేటాయించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా జిల్లెల, కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలో పలు భూములను కంపెనీ ప్రతినిధులకు చూపించామని, జిల్లెలలో 200 ఎకరాలివ్వడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా సంసిద్ధత వ్యక్తం చేసిందని నర్సింహారెడ్డి తెలిపారు. -
సర్కారీ ఉద్యోగాల కోసం పాకులాడొద్దు
టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాకులాడకుండా దళిత, గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పిలుపు నిచ్చారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అందజేస్తున్న ప్రోత్సాహకాలను, సబ్సి డీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో సోమవారం ఫ్యాప్సీ భవన్లో నిర్వహిం చిన ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వాలు ఖర్చుచేసిన రూ.లక్షల కోట్ల నిధులు దళిత, గిరిజను లకు పెద్దగా ఉపయోగపడలేదన్నారు. అనేక రకాల రాయితీలను అందిస్తున్నా వాటిని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగయువత అందుకోలే కపోవడానికి క్షేత్రస్థాయిలో అడ్డంకులు ఉన్నాయని బాలమల్లు పేర్కొన్నారు. లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా, మిగతా వాళ్లు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కోక తప్పదని సూచిం చారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఎస్సీ, ఎస్టీలకు 75శాతం దాకా సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలను అందించడమే కాకుండా పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.