టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాకులాడకుండా దళిత, గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పిలుపు నిచ్చారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అందజేస్తున్న ప్రోత్సాహకాలను, సబ్సి డీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో సోమవారం ఫ్యాప్సీ భవన్‌లో నిర్వహిం చిన ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వాలు ఖర్చుచేసిన రూ.లక్షల కోట్ల నిధులు దళిత, గిరిజను లకు పెద్దగా ఉపయోగపడలేదన్నారు. అనేక రకాల రాయితీలను అందిస్తున్నా వాటిని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగయువత అందుకోలే కపోవడానికి క్షేత్రస్థాయిలో అడ్డంకులు ఉన్నాయని బాలమల్లు పేర్కొన్నారు. లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా, మిగతా వాళ్లు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కోక తప్పదని సూచిం చారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఎస్సీ, ఎస్టీలకు 75శాతం దాకా సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలను అందించడమే కాకుండా పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.
సర్కారీ ఉద్యోగాల కోసం పాకులాడొద్దు
Published Tue, Apr 18 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM
Advertisement