ఓటర్లకు నమస్కరిస్తున్న మహేందర్‌రెడ్డి, ప్రచారంలో మాట్లాడుతున్న గొంగిడి
సాక్షి, యాదగిరిగుట్ట : ఆలేరు గడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని, టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత 50వేల పైచిలుకు మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గొంగిడి సునీతను గెలిపించాలని కోరుతూ బుధవారం మండలంలోని వంగపల్లి, చొల్లేరు, మహబూబ్‌పేట గ్రామాల్లో గెలిపించాలని కోరుతూ ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాకూటమి ఎన్ని మాయలు చేసినా టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. నాలుగున్న సంవత్సరాలుగా ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత గొంగిడి సునీతకే దక్కిందన్నారు. రెండు నెలలుగా గ్రామాల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలంతా నీరాంజనాలు పలికారని, పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు తీసుకురావడానికి ఇప్పటికే గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించారని, మరోసారి చట్టసభలకు ఇక్కడి ప్రజలు పంపిస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడి భూములను ససశ్యామలం చేస్తారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి రేపాక స్వామి, ఎంఈ అజ్జు, కానుగు రాజీవ్, హబీబ్, దయ్యాల భరత్, కానుగు దశరథ ఉన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిక..
మండలంలోని తాళ్లగూడెంలో బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు సైదగాని సత్యనారాయణ టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆమె గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్యనారాయణతో పాటు సాగర్, శరత్, గంధమల్ల రాములు, బాలకృష్ణ, ప్రభాకర్, కృష్ణమూర్తి, నర్సింహ, రాజు, సాయి ఉన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్‌గౌడ్, రాంపల్లి బాలరాజు, ఈదులకంటి భాస్కర్, గుజ్జ బాలరాజు తదితరులున్నారు.
టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం
ఆత్మకూరు(ఎం) : ఆలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆత్మకూరు(ఎం) మండలంలోని పల్లెర్ల, కప్రాయపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గొంగిడి సునీతను మరోమారు అసెంబ్లీకి మరోమారు పంపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, రెతు సమితి జిల్లా కోఆర్డినేటర్ కోరె భిక్షపతి, మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, టీఆర్‌ఎస్ మండల నాయకులు బీసు చందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ ఏనుగు దయాకర్‌రెడ్డి, నాయకులు దేవరపల్లి ప్రవీన్‌రెడ్డి, కాంబోజు భాను, బండ సాయి, శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సామ నరేందర్‌రెడ్డి, నిమ్మరెడ్డి నరేందర్‌రెడ్డి ఉన్నారు.
కూటమిని కుప్పకూల్చాలి
మోటకొండూర్ : కుట్రలతో ప్రజల ముందుకు వస్తున్న ప్రజాకూటమిని కుప్పకూల్చాలని టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంతో పాటు ఆరెగూడెం, గిరిబోయినగూడెం, మేడికుంటపల్లి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధితో ఏ పార్టీ పోటీపడలేక ప్రజాకూటమి పేరుతో ప్రజల ముందుకువస్తోందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి పాటుపడిన ఘనత గొంగిడి సునీతకే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి సునీతను అధిక మెర్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ బుగ్గ పర్వతాలు, ఎగ్గిడి బాలమ్మబాలయ్య, బొట్ల యాదయ్య, బొట్ల నర్సింహ, ఏదుల్ల సురేందర్‌రెడ్డి, సీస బాలరాజుగౌడ్, గుండు పెంటయ్యగౌడ్, బొలగాని నాగమణిమోహన్‌గౌడ్, పైళ్ల రంగారెడ్డి, సిరబోయిన నర్సింగ్‌యాదవ్, అనంతుల జంగారెడ్డి, ఆడెపు విజయ, రామదాస్‌గౌడ్, ఏనుగు అంజిరెడ్డి, చంద్రారెడ్డి, మోకాళ్ల అనంతరెడ్డి, కొరటికంటి విజయ్‌కుమార్‌గౌడ్, కొండ మహేష్, మల్గ లోకేష్, హరీష్, వీరస్వామి, గంధమల్ల మధు, జివిలికపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment