దర్జాగా కబ్జా..! | 24 acres land Occupation in yadadri District | Sakshi
Sakshi News home page

దర్జాగా కబ్జా..!

Published Sun, Dec 4 2016 2:58 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

24 acres land Occupation in yadadri District

రాఘవాపురంలో 24 ఎకరాలు భూమి ఆక్రమణ
 సీఎం కేసీఆర్‌కు బాధితుడి ఫిర్యాదు 
 రంగంలోకి దిగిన పోలీసులు.. 15 మంది అరెస్ట్.. ఆరుగురు పరారీలో..
 
 సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసింది. అధికారులు, రాజకీయ నాయకులు రికార్డులను తారుమారు చేసి ఎన్‌ఆర్‌ఐకి  చెం దిన 24ఎకరాల భూమిని కబ్జా చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను రాజకీయ నేతలు, అధికారులు కలిసి అక్రమిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ పేరుతో జరిగిన భూ అక్రమణ దందాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్‌లో భూ దాన్ బోర్డు మాజీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డిని శుక్రవారం  హయత్‌నగర్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. తాజాగా బీబీనగర్ మండలం రాఘవాపురంలో  సుమారు రూ.10 కోట్లు వి లువచేసే 24ఎకరాల భూమి(ఎకరం రూ.35 లక్షలు) స్థా నిక ఎంపీపీ భర్త టీఆర్‌ఎస్ నేత గోలి పింగల్‌రెడ్డి, మరో 22మంది కలిసి అక్రమంచిన ఘటన వెలుగుచూసింది.
 
 ఏం జరిగిందంటే..: బీబీనగర్ మండలం రాఘవాపురం లో హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు, పి.నాగేశ్వర్‌రావు మరో 11మందికి సంబంధించి న సర్వే నెంబర్ 567లోని 12ఎకరాల 22 గుంటలు, 569 లోని 9ఎకరాల 19గుంటలు, 583లోని 2ఎకరాలు మొ త్తం 24ఎకరాల ఒక గుంట భూమిని 1992లో ఎన్‌ఆర్‌ఐ దీపక్‌కాంత్‌వ్యాస్ కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. అలా గే తన భార్య శ్వేతవ్యాస్ పేరుమీద 586 సర్వే నెంబర్‌లోని 2ఎకరాల 6 గుంటలు, తన సోదరుడు విమల్‌కాంత్ వ్యా స్ పేరుపై 583సర్వేనెంబర్‌లోని 2ఎకరాల భూమి కొన్నా డు. 586, 583 సర్వే నెంబర్ల భూములు జస్తీ పార్వతీదేవి నుంచి కొనుగోలు చేసి పాస్‌బుక్‌లు, టైటిల్ డీడీలు పొందాడు. అనంతరం దీపక్  యూఎస్‌ఏ వెళ్లిపోయాడు. 
 
 నకిలీ పాస్‌బుక్‌లు, స్టాంప్‌లతో..
 దీపక్‌కాంత్‌కు చెందిన రెండు గుంటలు తక్కువ 24 ఎకరాలను బీబీనగర్‌కు చెందిన కొమ్మిడి వంశీకృష్ణారెడ్డి, భట్టగూడెంకు చెందిన వ్యక్తి జొన్నవాడ మహిపాల్‌రెడ్డి కబ్జా చే శాడు. 2007నుంచి ఈసర్వే నెంబర్లలోని భూములు రెవె న్యూ రికార్డుల్లో పట్టాదారులుగా దీపక్‌కాంత్ వ్యాస్ ఉండ గా కబ్జాలో మాత్రం వంశీధర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి పేర్లు వస్తున్నారుు.
 
 మరో దీపక్‌కాంత్‌ను సృష్టించారు
 కబ్జాదారులు భూ యజమానికి దీపక్‌కాంత్‌వ్యాస్‌కు బదులుగా కొత్త దీపక్‌కాంత్‌ను సృష్టించారు. అధికారులను మచ్చిక చేసుకుని రెవెన్యూ రికార్డుల్లోని దీపక్‌కాంత్ ఆధార్‌కార్డును తీసుకొని నకిలీ ఆధార్‌కార్డు, నకిలీ పాస్‌బుక్ తయారు చేశారు. ఈ పాస్‌బుక్‌లో దీపక్‌కాంత్‌కు బదులుగా గుర్తుతెలియని వ్యక్తి ఫొటో పెట్టి నకిలీపాస్‌బుక్‌లు పొందారు. మే 18, 2016న దీపక్‌కాంత్ హైదరాబాద్‌లో ని గడ్డి అన్నారంకు చెందిన బండారు జితేందర్‌కుమార్, హైదరాబాద్  హబ్సిగూడకు చెందిన జిల్లాల రవీం దర్‌రెడ్డి, మలిపెద్ది అరవింద్‌రెడ్డికి జీపీఏ చేసినట్లు రి కార్డులు సృష్టించి సేల్‌డీడీ కోసం బీబీనగర్ తహాసీల్దార్ కార్యాలయంలో ఆర్జీ చేశారు. కాగా రెవెన్యూ రికార్డుల్లో పట్టదారు, కబ్జదారుల పేర్లు వేర్వేరుగా వస్తుండడంతో తహసీల్దార్ సెల్ డీడీ చేయడానికి నిరాకరించారు. దీంతో ఇది అక్కడికే ఆగిపోయింది. ఆతర్వాత దీపక్‌కాంత్‌వ్యాస్‌కు  సం బంధించిన మ ద్యవర్తికి భూమి కబ్జా అరుున విషయం తెలిసింది. 
 
 మధ్య వర్తిని మచ్చిక చేసుకోవడాదనికి కబ్జాదారులు రూ.50లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. 24ఎకరాల భూమి విలువ సుమారు రూ.10 కోట్ల వరకు పలుకుతుండడంతో మధ్యవర్తి అక్రమార్కులకు సహకరించలేదు. భూమి కబ్జా అయిన విషయాన్ని  దీపక్‌కాంత్ వ్యాస్‌కు మధ్యవర్తి సమాచారం చేరవేశాడు.  కాగా  దీపక్‌కాంత్  భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ పోయాయి.దీపక్ కాంత్ తన భూమికబ్జా  జరిగిన విషయం,  పట్టాదారు పాస్‌పుస్తకా లు పోయిన  విషయాన్ని  సెప్టెంబర్‌లో ముఖ్య్యమంత్రి కే సీఆర్,  ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన సీఎం విచారణ జరపాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సూచించారు. ఈ మేరకు డిప్యూటీ సీ ఎం అక్టోబర్ 13న బీబీనగర్  తహసీల్దార్ అశోక్‌రెడ్డిని త న కార్యాలయానికి  పిలిపించి జరిగిన విషయాన్ని తెలుసుకుని కబ్జాదారులకు నోటీస్‌లు ఇవ్వాలని ఆదేశించారు. 
 
 నిజమైన భూమి యజమాని దీపక్ కాంత్ వ్యాస్‌కు పట్టాదారు, టైటిల్ డీడ్ డూప్లికేట్ ఇవ్వాలని ఆదేశించారు.అరుుతే  సేల్ డీడ్ కోసం ఈ సంవత్సరం మే 18న దరఖాస్తు చేసుకున్న కబ్జాదారులైన వంశీకృష్ణారెడ్డి, మహిపాల్‌రెడ్డికి  నవంబర్ 17న తహసీల్దార్ నోటీస్‌లు ఇచ్చారు. వీరిలో మహిపాల్‌రెడ్డి ఇటీవల మృతి  చెందాడు. అయితే వెంటనే ఆ భూమితో మాకెలాంటి సంబంధంలేదని కబ్జాదారులు బీబీనగర్  తహసీల్దార్‌కు  లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చా రు. తహసీల్దార్ విచారణ అనంతరం జరిగిన తప్పును గుర్తించి దీపక్‌కాంత్ వ్యాస్‌కు  డూప్లికేట్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు ఇచ్చారు. కబ్జా విషయాన్ని దీపక్‌కాంత్  రాచకొండ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీస్ క మిషనర్  ఇన్‌‌సపెక్టర్ నవీన్‌కుమార్‌ను విచారణాధికారిగా నియమించారు. దీంతో భూకబ్జాతోపాటుఅందులో ఉన్న వారందరిపై కేసు నమోదు చేశారు.
 
 వెంచర్‌చేసి అమ్మకానికి పెట్టారు 
 బీబీనగర్ చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు గోలిపింగల్‌రెడ్డి, పంజాల పెంటయ్య, కొమ్మిడి మల్లారెడ్డి, బిజిలియాదగిరి, బుయ్యసాంబయ్య, కొర్ని మహేష్, బానోతు లక్ష్మణ్‌లతోపాటు మొత్తం 21 మంది కలిసి భూమిని  రిజిస్ట్రేషన్ చేసుకుని వెంచర్ ప్రారంభించారు.  అమ్మకానికి పెట్టిన సమయంలో విషయం బయటపడింది.  
 
 గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్..!
 బీబీనగర్ తహసీల్దార్‌కార్యాలయం, భువనగిరి ఆర్డీవో కార్యాలయం రబ్బర్ స్టాంప్‌లను తయారు చేశారు. భూ యజమానికి సంబంధించిన నకిలీ ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌లను   శంకర్ అనే వ్యక్తి ఫోటో పెట్టి తయారు చేశారు. బీబీనగర్‌లో  సబ్‌రిజిస్టార్ కార్యాలయం ఉన్నా గుట్టు చ ప్పుడు కాకుండా పనికానిచ్చేందుకు చౌటుప్పల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను ఎంచుకున్నారు. అక్కడి అధికారులు సిబ్బం ది, డాక్యుమెంట్ రైటర్ సహకారంతో పని పూర్తి చేశారు.
 
 15 మంది అరెస్ట్ : భూ ఆక్రమణలో ప్రేమయం ఉన్న 21 మందిలో శనివారం  పోలీసులు 15 మంది అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఆరుగురు ప రారీలో ఉన్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement