సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసిన కొందరు టీడీపీ నేతలు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేత ఏకంగా గుట్ట పక్కనే ఉన్న పది ఎకరాలు భూమిని కబ్జా చేయడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లి పాములూరు గుట్టలో పది ఎకరాల భూమిని టీడీపీ నాయకుడు శేషారెడ్డి కబ్జా చేశాడు. అనంతరం, తన భూమి అన్నట్టుగా జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి గుట్ట వద్ద భూమిని చదును చేయించాడు. ఈ క్రమంలో 40 ఏళ్లుగా తాను ఆ భూమిని వాడుకుంటున్నట్టు చెప్పాడు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎంఆర్వో హరినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఆ భూమి వాడకం ఉన్నట్టు రికార్డుల్లో లేదన్నారు. తర్వాత.. పాములూరు గుట్ట వద్దకు వెళ్లి జేసీబీ ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. దీంతో, భూమి కబ్జా విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment