Bangalore ATM
-
'ఏటీఎం నిందితుడిని త్వరలో పట్టుకుంటాం'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు నగరంలోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన నిందితుడిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని కర్ణాటక డీజీ లాల్ రుక్మా తెలిపారు. అందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. గురువారం లాల్ రుక్మా మీడియాతో మాట్లాడారు. గతేడాది డిసెంబర్లో మహిళపై జరిగిన దాడి కేసు దర్యాప్తు కొనసాగుందన్నారు. గతేడాది డిసెంబర్ 2వ తేదీన కార్పోరేషన్ బ్యాంక్ మహిళ మేనేజర్ జ్యోతి ఉదయ్ నగదు తీసుకునేందుకు ఏటీఎంకి వెళ్లింది. ఆమె నగదు తీసుకుని వస్తున్న క్రమంలో ఆగంతకుడు ఏటీఎంలో ప్రవేశించి జ్యోతి ఉదయ్‌పై దాడి చేసి విచక్షణ రహతంగా గాయపరిచాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి, ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం నిందితుడు పరారైయ్యాడు. ఆ తర్వాత ఏటీఎంలోకి నగదు తీసుకునేందుకు వచ్చిన వారు ఆపస్మారక స్థితిలో ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జ్యోతి ఉదయ్ ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఏటీఎంలోని సీసీ కెమెరా పూటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ఆ క్రమంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయిన ఆ కేసులో పురోగతి మాత్రం అంతగా కనిపించ లేదు. దాంతో ఏటీఏం కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని విలేకర్లు గురువారం పోలీసు ఉన్నతాధికారిని ప్రశ్నించారు. దాంతో సదరు ఉన్నతాధికారిపై విధంగా స్పందించారు. -
అదిగో.. ఏటీఎం నిందితుడు!
రాయదుర్గం, న్యూస్‌లైన్: బెంగళూరులోని ఏటీఎం సెంటర్లో కార్పొరేషన్ బ్యాంక్ మహిళా మేనేజర్‌పై దాడి చేసి.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు కనిపించాడంటూ బుధవారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రచారం జరగడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. వివరాలిలా... బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఓ వ్యక్తి డబ్బు డ్రా చేసుకోవడానికి స్థానిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వద్దనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రంలోకి వెళ్లాడు. అతను బెంగళూరు ఏటీఎం నిందితుడి పోలికలతో ఉండడంతో సెక్యూరిటీ గార్డు పూల చంద్ర శేఖర్ ‘పట్టుకోండి.. పట్టుకోండి..’ అంటూ కేకలు వేశాడు. ఆలోగా ఆ వ్యక్తి బయటకు వచ్చి తన ద్విచక్ర వాహనంలో బస్టాండ్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో ముమ్మురంగా గాలించారు. కాగా ఉదయం ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన వ్యక్తి సాయంత్రం అదే మార్గంలో వెళుతుండగా సెక్యూరిటీ గార్డు అతన్ని గమనించి పోలీసులకు చూపించాడు. వారు అతన్ని ఆపి విచారించారు. అతను మండలంలోని చదం గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి అని, అతను నిందితుడు కాదని తేల్చారు. నిందితుడి పోలికలు ఉండడంతో సెక్యూరిటీ గార్డు పొరబడ్డాడని నిర్ధారించారు. -
అనంతపురం జిల్లాలో కలకలం
అనంతపురం: బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన నిందితుడిని పోలి ఉన్న వ్యక్తి అనంతపురం జిల్లా రాయదుర్గంలో కనిపించాడు. ఎస్బిఐ ఏటిఎం వద్ద సెక్యూరిటీ గార్డ్ అతనిని గుర్తించాడు. పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు పారిపోయాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో గత నెల 10న ప్రమీలమ్మ అనే మహిళను చంపిన హంతకుడు, 11న కదిరి ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి,19న బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి ఒక్కరేనని ఆంధ్ర, కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. అతను సైకో కావడంతో అతనిని పోలిన వ్యక్తే ఈ రోజు రాయదుర్గంలో కనిపించాడని తెలియడంతో ఎవరిని ఏం చేస్తాడోనన్న భయం కొందరిలో వ్యక్తమవుతోంది. అయితే అతను ఆ బెంగళూరు నిందితుడు కాదని పోలీసులు నిర్ధారించారు. రాయదురం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో ఏటిఎంకు వచ్చినది బెంగళూరు నిందితుడు కాదని వారు చెప్పారు. -
గాలింపు చర్యలు ముమ్మరం
పెనుకొండ, న్యూస్‌లైన్: పలు కీలకమైన కేసుల్లో ఎంతో నేర్పుతో నిందితులను అరెస్టు చేసిన ఘనత ఉన్నా, బెంగుళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన కేసులో నిందితుడిని పట్టుకోవడంలో మాత్రం కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. సంఘటన అనంతరం నిందితుడు జిల్లాలో తలదాచుకుని ఉండవచ్చన్న అనుమానంతో కొన్ని రోజులుగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా పోలీసులు సైతం నిందితుని కోసం ప్రత్యేక నిఘా ఉంచారు. కర్ణాటకకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు పోలీసు కమిషనర్ స్థాయి నుంచి ఎస్ఐ వరకు పలువురు అధికారులు గాలింపుల్లో పాల్గొంటుండడంతో వీరప్పన్‌ను పట్టుకోడానికి తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ గుర్తుకు వస్తోందని స్థానికులు అంటున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు నిందితునికి సంబంధించిన చిత్రాలను పంచడంతోపాటు, పట్టణంలోని బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, తదితర రద్దీ ప్రాంతాలన్నింటి వద్ద వాటిని అతికించినా ఫలితం లేకుండా పోతోంది. నిందితుని ఆచూకీ కాదు కదా, కనీసం అతను ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడన్న వివరాలపై కూడా ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. నిందితుడు పెనుకొండ ప్రాంతంలోనే తలదాచుకున్నాడన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫలితం ఆశాజనకంగా లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. -
పోలీసుల అదుపులో బెంగళూరు ఏటీఎం నిందితుడు!!
బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్ అనే మహిళపై దారుణంగా దాడిచేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలోని ఓ ఏటీఎం కేంద్రం వద్ద కూడా ఈ సైకో కలకలం సృష్టించాడు. ఆ సైకోకు ఇలాంటి వికృత చర్యలు కొత్తకాదు. అతను చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ 10న అనంతపురం జిల్లా ధర్మవరం చంద్రబాబునగర్‌లో ప్రమీలమ్మ అనే మహిళపై సైకో దాడి చేశాడు. ఆమె నుంచి రెండు ఏటీఎం కార్డులు లాక్కుని పిన్ నంబర్ తెలుసుకుని ప్రమీలను హత్య చేశాడు. ఆ రాత్రి కదిరికి పారిపోయాడు. 11న అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి ఓ కార్డు ద్వారా 4 వేలు డ్రా చేశాడు. తర్వాత బెంగళూరులో 15న మరో ఏటీఎం కార్డు ద్వారా 18 వేలు డ్రా చేశాడు. అయితే ప్రమీలమ్మ కుమారుడు ఆ రెండు ఏటీఎంలను బ్లాక్ చేయించారు. దాంతో ఆ ఏటీఎం కార్డులు పనికిరాకుండా పోయాయి. దీంతో 19న జ్యోతి ఉదయ్‌పై ఏటీఎం కేంద్రంలోనే దాడి చేసి, ఏటీఎం కార్డును తస్కరించాడు. కదిరిలో ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసిన సమయంలోనూ.. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసినప్పుడూ సైకో ఒకే విధమైన దుస్తులు ధరించినట్లు సీసీ కెమెరా ఫుటేజీలలో తేలింది. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు శనివారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో బెంగళూరు పోలీసులు శనివారం ధర్మవరం చేరుకుని విచారించారు. నిందితుడి వ్యహారశైలిని పరిశీలించిన పోలీసులు అతనో సైకోగా తేల్చారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా అందులో ఈ సైకో కూడా ఉన్నట్లు తెలిసింది. -
'ఏటీఎం' దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్!
రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో అతడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. హిందుపురం పట్టణంలో మొబైలు ఫోన్ విక్రయిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అనుమానితుడు హిందుపురానికి చెందినవాడు. పోలీసులు విచారణ నిమిత్తం అతడిని కర్ణాటకకు తరలించారు. కాగా బెంగళూరులో నగదు డ్రా చేసేందుకు బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించి షెటర్ మూసివేసి, ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. అలాగే తలపై బలంగా కొట్టాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదుతో పాటు సెల్ ఫోన్ తీసుకుని అతడు పరారయ్యాడు. ఏటీఎం నుంచి రక్తం రావడంతో స్థానికులు అనుమానించి షటర్ ఎత్తి చూడటంతో రక్తపు మడుగులో మహిళ అపస్మారక స్థితిలో ఉంది. దాంతో ఆమెను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఏటీఎంలో మహిళపై ఆగంతకుడు దాడి, అనంతరం జరిగిన తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాంతో పోలీసులు సీసీ పూటేజ్‌లను పరిశీలించారు. నిందుతుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కర్ణాటక పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసుల సహాయం తీసుకున్నారు. దాంతో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అనుమానితుడి అరెస్ట్ ను పోలీసులు ఇంకా ద్రువీకరించలేదు. -
ATM షట్టర్ మూసి మహిళపై కత్తితో దాడి