ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ప్రారంభించారు.
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాల కోసం ఇక నుంచి apobmms.cgg.gov.in
వెబ్‌సైట్ ద్వారా ఏపీ స్టేట్ కాపు కార్పొరేషన్‌కు దరఖాస్తుచేసుకోవచ్చన్నారు. కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించిందని, ఆర్థికంగా కాపుల ఎదుగుదలకు ఉపయోగపడే పనులకు రుణాలు మంజూరు చేస్తామన్నారు.