ఇక షురూ | Akhil Movie Shooting Started By Director Bommarillu Bhaskar | Sakshi
Sakshi News home page

ఇక షురూ

Published Wed, Jul 17 2019 12:28 AM | Last Updated on Wed, Jul 17 2019 12:28 AM

Akhil Movie Shooting Started By Director Bommarillu Bhaskar - Sakshi

దాదాపు ఆరు నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చారు అఖిల్‌. ‘బొమ్మరిల్లు, పరుగు’ వంటి చిత్రాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా ఆరంభమైన సంగతి తెలిసిందే. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్‌ పదిరోజులపాటు సాగుతుందట. నెక్ట్స్‌ ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసిందట టీమ్‌. ప్రస్తుతం హీరోపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు ఎంపికయ్యారు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement