Bommarillu bhaskar
-
Bommarillu Bhaskar-Siddhu Jonnalagadda New Movie Launch: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్‌తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్‌తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
మరోసారి వాయిదా పడ్డ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'
Most Eligible Bachelor Release Date: యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, తాజాగా మరోసారి రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందించిన ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.చదవండి : 'లవ్‌స్టోరీ' సినిమాపై మహేశ్‌బాబు రివ్యూ అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. మని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిచారు. చదవండి : ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్ #MostEligibleBachelor Arriving in theatres near you this Oct 15th, 2021.#AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @GA2Official @adityamusic pic.twitter.com/7BamMJ2Ajt — GA2 Pictures (@GA2Official) September 26, 2021 Meet our #MostEligibleBachelor in theatres from 𝐎𝐂𝐓 𝟏𝟓𝐭𝐡!🧡 This Dusshera we invite you to theatres with your families for a wholesome entertainment!🤩@AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic pic.twitter.com/e5EPlI6tkC — GA2 Pictures (@GA2Official) September 26, 2021 -
‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్ర నా నిజ జీవితంలోనిది: డైరెక్టర్
‘బొమ్మరిల్లు’.. ఈ సినిమా పేరు వినగానే మొదట గుర్తొచ్చే పాత్ర ఏంటంటే హా.. హా.. హాసిని. అంతగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తం హీరోయిన్ చూట్లూ తిరిగే ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బొమ్మరిల్లు హిట్‌తో డైరెక్టర్ భాస్కర్ పేరు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌గా మారింది. అంత పెద్ద విజయం సాధించిన ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలను డైరెక్టర్ భాస్కర్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించిన హాసిని పాత్రను ఎలా క్రియేట్ చేశారన్నది ఈ సందర్భంగా వివరించాడు. చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ ఆయన మాట్లాడుతూ.. తన నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా హాసిని పాత్రను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ‘ఆర్య సినిమాకు పని చేస్తున్న సమయంలో ఈ మూవీ హిట్ అయితే నాతో ఓ సినిమా చేస్తానని రాజు గారు(‘దిల్’ రాజు) మాట ఇచ్చారు. మంచి కథ సిద్దం చేసి తనని కలవమని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆర్య హిట్ అయ్యింది. దీంతో ఆయనకు రెండు సార్లు స్క్రిప్ట్‌లు వివరించాను. అవి ఆయనకు నచ్చలేదు. మూడోసారి బొమ్మరిల్లు కథతో వెళ్లాను. ఈ కథ నచ్చింది కానీ, హీరోయిన్ పాత్ర అంతగా లేదు, దాని మీద మరింత వర్క్ చేసి రమ్మన్నారు. దీనికి నేను 15 రోజులు గడువు అడిగాను. హీరోయిన్ పాత్ర ఎలా తీర్చిదిద్దాలని నేను, వాసు వర్మ తెగ ఆలోచించాం. కానీ సరైన లైన్ తట్టట్లేదు. ఇలా 14 రోజులు గడిచాయి. చిరాకు వస్తుంది. 15వ రోజు వచ్చేసింది. రాత్రంతా నిద్ర లేదు’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. ఇక ‘ఆ రోజు రాత్రి నేను, వాసు చర్చించుకుంటూనే ఉన్నాం. మాటల మధ్యలో నా జీవితంలో జరిగిన సంఘటనను ఆయనకు చెప్పాను. ఒకమ్మాయిని అనుకోకుండా గుద్ది సారీ చెబితే.. తనొచ్చి ఒకసారి గుద్ది వెళ్లిపోతే కొమ్ములు వస్తాయని మరోసారి ఢీకొట్టి వెళ్లిందని చెప్పాను. అది బాగుందని వాసు అనడంతో ఆ సీన్ రాశాం. ఇక దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటూ పాత్రను తీర్చిదిద్దాం. మరుసటి రోజు సాయంత్రం వెళ్లి రాజు గారికి ఈ క్యారెక్టర్ గురించి చెబితే భలే ఉంది అన్నారు. దీంతో ఈ పాత్రకు ఏ హీరోయిన్ కావాలని అడిగారు. జెనీలియాను తీసుకుందామని చెప్పాను. అలా హాసిని పాత్రను చాలా కష్టపడి క్రియేట్ చేశాం’ అని వివరించాడు. కాగా 9 ఆగష్టు 2006 విడుదలైన ఈ చిత్రంలో హీరోగా సిద్దార్థ్ నటించాడు. ప్రకాశ్ రాజ్, జయసుధలు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: ఫుట్‌బోర్డ్‌పై సమంత, నయన్, విజయ్.. వీడియో వైరల్ -
మ్యూజిక్ ఓ హైలైట్: బొమ్మరిల్లు భాస్కర్
అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘గుచ్చే గులాబిలా..’ పాటను వేలంటైన్స్ డేకి రిలీజ్ చేశారు. గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటను అనంత్ శ్రీరామ్, శ్రీమణి రచించారు. అర్మాన్స్ మాలిక్ ఆలపించారు. ఈ పాటకు విశేష స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. భాస్కర్ మాట్లడుతూ – ‘‘పాట సందర్భాన్ని వివరిస్తున్నప్పుడే గోపీసుందర్ ట్యూన్స్ ఇచ్చేశారు. మా సినిమాకు మ్యూజిక్ ఓ హైలెట్’’ అన్నారు. ‘‘భాస్కర్‌గారు కథ చెప్పిన విధానం నచ్చింది. అప్పుడే మంచి ట్యూన్స్ కట్టేశాం. మిగతా పాటలను కూడా అందరికీ త్వరగా వినిపించాలనుంది’’ అన్నారు గోపీసుందర్. -
వేసవిలో వస్తున్నాం!
వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి సిద్ధమయ్యారు హీరో అఖిల్, దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్. అందుకే చిత్రీకరణను వేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం. అఖిల్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఓ రొమాంటిక్ కామెడి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అఖిల్, పూజా కెమిస్ట్రీ ఈ ప్రేమ కథలో హైలెట్‌గా ఉంటుందట. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్‌తో సినిమా ప్రథమార్ధం పూర్తయిందని తెలిసింది. ఈ నెల మొదటివారం నుంచి తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మార్చి చివరి వారంలోగా షూటింగ్ పూర్తి చేసి, ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీత దర్శకుడు. -
సమ్మర్లో కలుద్దాం
... అని అఖిల్ అంటున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సమ్మర్లో రిలీజ్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో ఓ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీత దర్శకుడు. -
హిట్ డైరెక్టర్‌తో అఖిల్ నెక్ట్స్..!
అక్కినేని నటవారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన నటుడు అక్కినేని అఖిల్. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ తరువాత లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా అఖిల్ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట అఖిల్. గీత గోవిందం సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న పరశురామ్ తరువాత మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నించాడు. దాదాపుగా ఓకే అను ప్రాజెక్ట్ ఆగిపోవటంతో ప్రస్తుతం అఖిల్ సినిమా మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
చిన్న విరామం
వరుస షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా ఉన్న అఖిల్ చిన్న విరామం తీసుకున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా ఫిక్స్ అయ్యారు. ఇప్పటివరకూ జరిగిన షెడ్యూల్స్‌లో ఆమె పాల్గొనలేదు. వచ్చే వారంలో ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో పూజా హెగ్డే కూడా పాల్గొంటారు. హీరో హీరోయిన్లపై కొన్ని లవ్ సీన్స్ ప్లాన్ చేశారట. ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త. ఈ చిత్రం తర్వాత ‘అ!, కల్కి’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించే సినిమా మొదలవుతుంది. -
ఇక షురూ
దాదాపు ఆరు నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చారు అఖిల్. ‘బొమ్మరిల్లు, పరుగు’ వంటి చిత్రాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా ఆరంభమైన సంగతి తెలిసిందే. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్ పదిరోజులపాటు సాగుతుందట. నెక్ట్స్ ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసిందట టీమ్. ప్రస్తుతం హీరోపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు ఎంపికయ్యారు? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఆల్ సెట్
అంతా సెట్ చేసుకున్నారు. ఇక సెట్లోకి ఎంటర్ కావడమే ఆలస్యం. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఇప్పటివరకు కియారా అద్వానీ, రష్మికా మండన్నాల పేర్లు వినిపించాయి. మరో వారంలో కథానాయికగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై అధికారిక ప్రకటన రావొచ్చని తెలిసింది. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ రెండో వారంలో మొదలు కానుందని సమాచారం. అందమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ హంగులను జోడించి సినిమాలు తీస్తుంటారు ‘బొమ్మరిల్లు’ భాస్కర్. పరుగు, ఆరెంజ్ అలాంటి చిత్రాలే. ప్రస్తుతం అఖిల్‌తో చేయబోతున్న స్క్రిప్ట్ కూడా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుందట. ఒకవైపు భాస్కర్ కథ రెడీ చేస్తుంటే మరోవైపు ఇతర ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. పర్ఫెక్ట్ ప్లాన్‌తో జూన్‌లో సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించనున్నారు. -
ఫ్లాప్ డైరెక్టర్‌తో వెంకీ..!
ఇటీవల సినిమా ఎంపికలో కాస్త స్లో అయిన వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో కలిసి ఎఫ్2 సినిమాలో నటిస్తున్న ఈ సీనియర్ స్టార్ త్వరలో నాగచైతన్యతో వెంకీ మామ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా వెంకటేష్ హీరోగా మరో సినిమా తెరకెక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు సినిమాతో హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో నటించేందుకు వెంకీ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. బొమ్మరిల్లు తరువాత పరుగుతో పరవాలేదనిపించినా ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో భాస్కర్ కెరీర్ కష్టాల్లో పడింది. ఇటీవల బెంగళూర్ డేస్ సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. దీంతో మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్న భాస్కర్, వెంకటేష్‌కు ఓ లైన్ వినిపించారట. వెంకీకి ఆ లైన్ నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో భాస్కర్ సినిమా ఓకె అయిన సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయమే పడుతుంది. -
గోపీచంద్‌తో ‘బొమ్మరిల్లు’?
‘బొమ్మరిల్లు’ వంటి చక్కటి కుటుంబ కథా చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు భాస్కర్. ఆ సినిమాతో తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న వారిలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా చేరారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పరుగు’ సినిమా మంచి విజయం అందుకోగా, ‘ఆరెంజ్, ఒంగోలు గిత్త’ సినిమాలు నిరాశ పరచాయి. ఆ చిత్రాల తర్వాత ఆయన తెలుగు సినిమాలేమీ చేయలేదు. కానీ, తమిళంలో చేశారు. తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్‌తో భాస్కర్ ఓ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సర్కిల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గోపీచంద్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఆయన ఓ కథ రెడీ చేశారట. గోపి–భాస్కర్ కాంబినేషన్లో సినిమా నిర్మించేందుకు నిర్మాతలు కూడా రెడీ అట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వీరి కాంబినేషన్లో రానున్న సినిమా గోపీచంద్ తరహా యాక్షన్ నేపథ్యంలో ఉంటుందా? భాస్కర్ శైలిలో ఫ్యామిలీ, ప్రేమ నేపథ్యంలో ఉంటుందా? అన్న ఆసక్తికర చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. ఈ సినిమాతో పాటు అల్లు అరవింద్, డి.సురేశ్‌బాబు బ్యానర్లలో సినిమాలు చేసేందుకు కథలు సిద్ధం చేసుకుంటున్నారట భాస్కర్. -
ఫైనల్‌గా సినిమా పట్టాడు..!
తొలి సినిమా బొమ్మరిల్లుతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన యువ దర్శకుడు భాస్కర్, తరువాత ఒక్క ఫ్లాప్‌తో కష్టాల్లో పడ్డాడు. ఆరెంజ్ సినిమాతో డిజాస్టర్ రావటంతో భాస్కర్ కు ఛాన్స్ ఇచ్చే వారే కరువయ్యారు. లాంగ్ గ్యాప్ తరువాత ఓ తమిళ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నా వర్క్ అవుట్ కాలేదు. దీంతో భాస్కర్‌కు మరోసారి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాంగ్ గ్యాప్ తరువాత ఈ యువ దర్శకుడిగా ఓ ఛాన్స్ వచ్చింది. తాజాగా భాస్కర్.. గోపిచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు అల్లు అరవింద్, సురేష్ బాబుల నిర్మాణంలోనూ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. -
వెంకీ.. విజయ్.. ఓ మల్టీస్టారర్!?
మల్టీస్టారర్స్ చేయడానికి వెంకటేశ్ ఎప్పుడూ సిద్ధమే. అయితే... ఆయనకు కథ, అందులో పాత్రలు నచ్చాలి. మహేశ్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, రామ్‌తో ‘మసాలా’, పవన్‌కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’ చేశారాయన. ఇప్పుడు వెంకటేశ్ ఓ మల్టీస్టారర్ అంగీకరించారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇందులో మరో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తారట! ఈ సిన్మాకు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తారట. వెంకీ, విజయ్... ఇద్దరూ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని కొందరు చెబుతున్నారు. ఈ ఏడాది ఆఖరున లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కానున్న ఈ సినిమాను ‘రాక్‌లైన్’ వెంకటేశ్ నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ‘అర్జున్‌రెడ్డి’ కంటే ముందే విజయ్ దేవరకొండను సంప్రదించగా ‘యస్’ చెప్పారట! ప్రస్తుతం దర్శకుడు కథకు తుది మెరుగులు దిద్దుతున్నారట. త్వరలో వివరాలన్నీ వెల్లడిస్తారేమో!! -
బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ వస్తున్నాడు
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు భాస్కర్. ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకొని బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. అయితే తొలి మ్యాజిక్ ను తరువాత కంటిన్యూ చేయలేకపోయిన భాస్కర్, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. బొమ్మరిల్లు తరువాత పరుగు లాంటి సక్సెస్ ఇచ్చినా ఆరెంజ్, ఒంగోళు గిత్త సినిమాలు భాస్కర్ కెరీర్ ను కష్టాల్లో పడేశాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఇటీవల మలయాళ సూపర్ హిట్ సినిమా బెంగళూర్ డేస్ ను తమిళ్ లో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరోసారి గ్యాప్ తీసుకొని టాలీవుడ్ లో రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నాడు. మెగా కాంపౌండ్ తో మంచి రిలేషన్ ఉండటంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ముందుగా ఈ సినిమాను అల్లు అర్జున్ హీరోగా ప్లాన్ చేసినా.. ఇప్పుడు వేరే హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
టైటిల్ వివాదానికి తెర దించాడు
మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే, కోలీవుడ్‌లో సినీ రంగానికి, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. అందుకే అక్కడి సినిమాలు, సినీ నటులు ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంటారు. ఇలా వివాదాల్లో ఇరుక్కున్న ఓ సినిమా ఇప్పుడు బయటపడింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బెంగళూర్ డేస్' తమిళ రీమేక్, టైటిల్ వివాదం సద్దుమణిగింది. రానా, ఆర్య, శ్రీ దివ్య, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రీమేక్ సినిమాకు ముందుగా 'అర్జున్ దివ్య మీనాక్షి కార్తీక్' అనే పేరు పెట్టారు. అభిమానులకు ఈ పేరును షార్ట్ కట్లో ఏడీఎంకే అని అలవాటు చేశారు. దీంతో వివాదం మొదలైంది. తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పేరు అన్నాడీఎంకే కావటంతో సినిమా విడుదల నిలిపివేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమాకు మదగజ రాజా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సినిమాను షార్ట్ ఫాంలో ఎమ్జిఆర్ అని పిలవటంతో ఆ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. దీంతో తమ సినిమా విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో అన్న ఆలోచనతో భాస్కర్ తన సినిమా టైటిల్‌ను మార్చేశాడు. ఇప్పటివరకు ఏడియంకేగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 'బెంగళూరు నాట్గల్' అనే పేరును ఫైనల్ చేశారు. దీంతో చాలా రోజులుగా నలుగుతున్న టైటిల్ వివాదానికి తెరపడింది. -
ఆ ఇద్దరూ 'బెంగళూరు డేస్' కెళ్లారు..
తెలుగులో మరో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది. అప్పట్లో తాతలు కలిసి నటిస్తే ఇప్పుడు.. మనవళ్లు కలిసి నటించబోతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, లవర్ బాయ్ నాగ చైతన్య కలిసి నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతుంది. 'బొమ్మరిల్లు'ను ఇంటి పేరుగా మార్చుకున్న భాస్కర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మలయాళ చిత్రం 'బెంగళూరు డేస్' రీమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా హీరోయిన్స్ ఎవరనేది ఖరారు కాలేదు. కాగా 'బెంగళూరు డేస్' హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా హక్కులను మరో నిర్మాణ సంస్థకు అప్పగించినా.. దిల్ రాజు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. గతంలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా రుపొందబోతున్నదని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. దాంతో 'నాగ్'తో మిస్ అయిన ఛాన్స్...ఇప్పుడు కొడుకుతో భర్తీ అయినట్లు అయింది. కాగా గత ఏడాది కాలంగా నాగార్జున, బాలకృష్ణల మధ్య మాటలు లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అబ్బాయిలు ఇద్దరూ కలిసి నటించటం విశేషం. -
తొలియత్నం: క్లైమాక్స్‌లో ఒక్కసారిగా ఏడ్చేశాం
దారం పూలను కలిపినట్టుగా బంధం మనుషుల్ని కట్టిపడేస్తుంది.బాధ్యత పరిధులు దాటినప్పుడు బంధం ఒక్కోసారి బంధనమవుతుంది.సున్నితమైన రేకులతో అందంగా అమరిన సంబంధాలు ఏమాత్రం కదిలినా ముళ్లలా తాకి మనసును గాయపరుస్తాయి.ఎగిరే రెక్కలను ప్రేమతో కట్టిపడేసి, పరిగెత్తే పాదాలకు పరిమితులు గీసినప్పుడు అందమైన బొమ్మరిల్లు లాటి ఊహలు ఎలా కుప్పకూలుతాయో,అనుబంధాలు ఎలా ముక్కలవుతాయో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు భాస్కర్. ఆయన తొలియత్నం తాలూకు అనుభవాల పరంపర ఆయన మాటల్లోనే. కధ చెప్పడం మొదలుపెట్టాను. దిల్ రాజు గారు నిశితంగా నాకేసి చూస్తూ,ముఖంలో ఏ భావమూ కనిపించనీయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఒక్కో సీన్ చెప్పుకుంటూ పోతున్నాను. ఒక్కసారిగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. అప్పటిదాకా కళ్లమాటున దాగిన కన్నీళ్లు కనురెప్పల కట్టల్ని తెంచుకుని దూకాయి. నా పరిస్ధితీ అంతే. ఒక్కసారిగా ఏడ్చేశాను. సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అంతే. చివరకు సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కదిలిపోయారు. ఇతమందిని కదిలించిన కధ ఊహల్లోంచి ఊడిపడలేదు. జీవితంలోంచి ఉబికివచ్చింది. నాతో పాటు,నా చుట్టూ మనుషుల జీవితాల్లోంచి. కథ, పాత్రలు వాటి చుట్టూతా అల్లుకున్న భావోద్వేగాలు ఇవన్నీ రక్తమాంసాలతో మనందరి చుట్టూ తిరుగాడేవే. చెన్నైలో అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు మొదటిసారిగా బొమ్మరిల్లు కధ నా మనసును తట్టింది. ఎప్పటినుంచో నా మనసులో మెదలుతున్న రకరకాల భావాలు కథకు బీజం వేశాయి. తండ్రీ కొడుకుల మధ్య సహజంగా ఉండే కమ్యూనికేషన్ గ్యాప్, తరువాత ఒక అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉండటం, టైటిల్స్ ప్రెజెంటేషన్... లోపల విడివిడిగా ఉన్న ఆలోచనలు ఒక స్పష్టమైన కథారూపం తీసుకోసాగాయి. ఐతే, మొదటి దశ అక్కడికే ఆగిపోయింది. దాన్ని స్క్రిప్ట్‌గా మలచాలన్న సీరియస్‌నెస్ లేకపోవడంతో కథ అక్కడితో ఆగింది. కానీ నా మిత్రుడు, దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ గురించి అప్పుడప్పుడూ గుర్తుచేసేవాడు. కొంత కాలం తరువాత తట్టిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తిరిగి, నన్ను స్క్రిప్ట్వైపు పురిగొల్పింది. స్క్రిప్ట్ రాస్తున్న క్రమంలో వినాయక్ కో-డెరైక్టర్ వాసు చాలా హెల్ప్ చేశాడు. బొమ్మరిల్లులో ప్రకాష్‌రాజ్‌కి, మా నాన్నకు పెద్ద తేడా లేదు. ఒక మంచి నాన్నగా తను నాకు కావలసినవన్నీ సమకూర్చేవాడు. నేను నాకు నప్పే డ్రెస్‌లు వేసుకోవాలనుకునేవాణ్ని. కానీ మా నాన్న నాతో షాపింగ్‌కు వచ్చి, నాకు నచ్చని కలర్స్ సెలక్ట్ చేసేవాడు. నాన్నను బాధపెట్టడం ఇష్టం లేక, తను సెలక్ట్ చేసిన డ్రెస్‌లు వేసుకునేవాణ్ని. తన సంతోషం కోసం నా ఇష్టాలు చంపుకునేవాడిని. ఇది అంతర్గతంగా నా మీద ప్రభావం చూపించింది. నాతో పాటు కొంతమంది మిత్రుల నాన్నల నుంచి ప్రకాష్‌రాజ్ పాత్ర రాసుకున్నాను. జెనీలియా పాత్ర కూడా నిజ జీవితంలోంచి వచ్చిందే. ఒకసారి పొరబాటున నా తల ఒకమ్మాయి తలకు తాకింది. నేను వెంటనే సారీ చెప్పాను. ఆ అమ్మాయి మళ్లీ నా దగ్గరకు వచ్చింది. మళ్లీ సారీ చెప్పాను. మరి కొమ్ములు అంది అమ్మాయి. నాకర్థం కాలేదు. కొమ్ములు రాకుండా ఉండటం కోసం తల మరోసారి తాకించాలని చెప్పింది. ఇదే సీన్ జెనీలియా ఇంట్రడక్షన్‌కు వాడుదామనుకున్నాను. కానీ వాసు అలా కాకుండా దీన్ని సినిమా అంతటా ఒక థ్రెడ్‌లా వాడుకుంటే బావుంటుందనడంతో అలాగే చేశాం. హీరో చెల్లెలు బ్యూటీషియన్ క్యారెక్టర్ మా సిస్టర్ను చూసే రాసుకున్నాను. ఎప్పుడైనా ఇంటికెళ్లాలంటే తను చేసే ఫేషియల్ గుర్తొచ్చి, భయమేసేది. ఫేషియల్ చేసి మా దగ్గర వంద రూపాయలు వసూలు చేసేది. హీరో తల్లి క్యారెక్టర్‌ను మా ఫ్రెండ్ మదర్ నుంచి తీసుకున్నాను. కిచెన్‌లో పాటలు పాడుతూ వంట చేయడం, ప్రేమగా కుటుంబానికి వడ్డించే తీరు ఇవన్నీ జయసుధ క్యారెక్టర్‌కు ఆపాదించాను. ఈ కథ మా అమ్మకు వినిపించినప్పుడు, అసలు తల్లిదండ్రులు పిల్లలకు ఎందుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అంది. దాంతో ఎవరికైనా కొన్ని పరిమితులకు లోబడే స్వేచ్ఛ ఉండటమే సబబు అనుకున్నాను. అందుకే కొన్ని పరిమితులతో కూడిన స్వేచ్ఛ అవసరాన్ని తండ్రిగా కోట మనోభావాలను ప్రతిఫలించే డైలాగ్స్‌ను చివర్లో రాశాను. కథ పూర్తయ్యాక హీరో పాత్రకు సిద్ధార్ధ్ అయితేనే బాగుంటుందనుకున్నాను. ఇక హీరోయిన్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్. ఈ పాత్రకు జెనీలియా న్యాయం చేస్తుందనుకుని, తనను ఎంచుకున్నాం. తండ్రి పాత్రకు ప్రకాష్‌రాజ్‌ను కథ రాస్తున్నప్పుడే నిర్ణయించుకున్నాను. కథ విన్నాక, చాలా ఇష్టంగా, తన క్యారెక్టర్‌కు తగ్గట్టుగా బాడీ ల్యాంగ్వేజ్‌ను మలుచుకున్నారు. తల్లి పాత్రకు జయసుధగారే కరెక్ట్ అని దిల్‌రాజుగారిని ఒప్పించి తీసుకున్నాను. కోట శ్రీనివాసరావుగారు తన నటనతో పాత్రను చాలా మెరుగుపరిచారు. సినిమా షూటింగ్లో కొన్ని సన్నివేశాల్లో నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఒక రచయితగా తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు రాయాల్సివచ్చినప్పుడు, కొడుకువైపు నిలబడి చాలా ఆవేశంగా డైలాగ్స్ రాశాను. షూట్ చేస్తున్నప్పుడు చివరలో కొడుకు మాటలు విని నిస్సహాయంగా కుప్పకూలిన ప్రకాష్‌రాజ్‌ను చూశాక, తండ్రిపట్ల నాకు సానుభూతి కలగడం మొదలుపెట్టింది. తండ్రిని తప్పుగా ప్రెజెంట్ చేస్తున్నానేమోనన్న గిల్టీ ఫీలింగ్ రావడం మొదలుపెట్టింది. ఈ సీన్ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది. ఇదొక్కటే కాదు, చాలా సీన్స్‌లో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ ఇంట్లోంచి జెనీలియా వెళ్లిపోయేటప్పుడు చెప్పిన కారణాలు మేం చాలా కన్విన్సింగ్‌గా రాయగలిగామనిపించింది. చివరి సీన్ విషయంలో నిర్మాత దిల్ రాజుగారితో చిన్నపాటి వాదన జరిగింది. టైటిల్స్ రోల్ అయ్యేటప్పుడు కోట శ్రీనివాసరావు ఇంట్లో సీన్స్ ఉంచుదామని నేను గట్టిగా వాదించాను. ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రేక్షకులు థియేటర్‌ను వదిలి వెళ్లరనే నమ్మకంతో ఉండేవాణ్ని. నా నమ్మకం నిజమైంది. నిజానికి క్లైమాక్స్ కోసం చాలా సీన్స్ రాసుకున్నాను. కానీ కొన్ని ప్రాక్టికల్ కారణాల వల్ల, వాటన్నింటినీ షూట్ చేయలేకపోయాను. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్ సినిమాలో ఏం ఉండాలనుకున్నానో అవన్నీ షూట్ చేయి, నిడివి గురించి నీ ఆలోచనలతో రాజీపడకు అని మొదటినుంచీ చివరిదాకా నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చారు. చివరకు సినిమా 16,200 అడుగులు అంటే దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాలు వస్తే, ఆయన ఎమోషనల్ కనెక్షన్స్ ఏమాత్రం దెబ్బతినకుండా, రెండు గంటల యాభై నిమిషాలకు కుదించారు. మా టీమ్ అందించిన సహకారం కూడా బొమ్మరిల్లును అందమైన కుటుంబ కథాచిత్రంగా మలిచింది. సినిమాటోగ్రాఫర్ విజయ్ చక్రవర్తి ఫిలిం స్కూల్లో నా సీనియర్. లైటింగ్, కలర్స్ విషయంలో ఆయన చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డెరైక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ ముగ్గురి మధ్యా ఒక అద్భుతమైన సమన్వయం కుదిరింది. డైలాగ్స్ చాలా సహజంగా, సంభాషణల్లా ఉండాలనుకున్నాం. మా ఆలోచనలకు తగ్గట్టుగా రచయిత అబ్బూరి రవి డైలాగ్స్ చాలా సరళంగా రాశారు. సునీల్ క్యారెక్టర్‌ను తను చాలా చక్కగా మలిచారు. ఎక్కడా కృత్రిమ హాస్యం చొప్పించకుండా సన్నివేశాలకనుగుణంగా హాస్యం పండించే ప్రయత్నం చేశాం. ఇక దేవిశ్రీ ప్రసాద్‌కు కథ చెప్పి, స్వేచ్ఛగా వదిలేశాం. దాంతో అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాలో నేను చిన్న చిన్న డీటెయిల్స్ పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నాను. అవి సినిమా క్వాలిటీని మరింత పెంచుతాయనేది మొదటినుంచీ నా అభిప్రాయం. ఈ విషయంలో మణిరత్నం నాకు స్ఫూర్తి. బొమ్మరిల్లు ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ప్రయాణంలో మనుషులు, బంధాలు, భావోద్వేగాలు ఒకదానికొకటి అల్లుకుని, ప్రతి ఒక్కరికీ ఇది మాకు తెలిసిన జీవితం అన్న భావనను కలుగజేశాయి.సినిమా విడుదలయ్యాక నాకు తెలిసిన చాలామంది తండ్రులు తాము పిల్లలతో వ్యవహరించే విధానంలో చాలా తేడా వచ్చింది. సినిమా విడుదలయ్యాక, మొదట రాజమౌళిగారు ఫోన్ చేసి, క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా డిజైన్ చేశావని ప్రసంశించి, పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఆ తరువాత తెలుగునాట ప్రతి ఇంటా బొమ్మరిల్లు గురించి చర్చ జరిగింది. అప్పటినుంచి ఆ సినిమా పేరే నా ఇంటిపేరుగా మారిపోయింది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి