బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ వస్తున్నాడు | Bommarillu Bhaskar Movie with Geetha Arts | Sakshi
Sakshi News home page

బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ వస్తున్నాడు

Published Sat, Oct 15 2016 2:20 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ వస్తున్నాడు

బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ వస్తున్నాడు

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు భాస్కర్. ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకొని బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. అయితే తొలి మ్యాజిక్ ను తరువాత కంటిన్యూ చేయలేకపోయిన భాస్కర్, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. బొమ్మరిల్లు తరువాత పరుగు లాంటి సక్సెస్ ఇచ్చినా ఆరెంజ్, ఒంగోళు గిత్త సినిమాలు భాస్కర్ కెరీర్ ను కష్టాల్లో పడేశాయి.

దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఇటీవల మలయాళ సూపర్ హిట్ సినిమా బెంగళూర్ డేస్ ను తమిళ్ లో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరోసారి గ్యాప్ తీసుకొని టాలీవుడ్ లో రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నాడు. మెగా కాంపౌండ్ తో మంచి రిలేషన్ ఉండటంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ముందుగా ఈ సినిమాను అల్లు అర్జున్ హీరోగా ప్లాన్ చేసినా.. ఇప్పుడు వేరే హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement