Most Eligible Bachelor Release Date In Telugu | Pooja Hegde Akhil Movie Release Date - Sakshi
Sakshi News home page

Most Eligible Bachelor: దసరా కానుకగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'

Published Sun, Sep 26 2021 11:45 AM | Last Updated on Sun, Sep 26 2021 12:26 PM

Most Eligible Bachelor Release Date In Telugu - Sakshi

Most Eligible Bachelor Release Date: యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌' చిత్రం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్‌ 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, తాజాగా మరోసారి రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేశారు. రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందించిన ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.చదవండి : 'లవ్‌స్టోరీ' సినిమాపై మహేశ్‌బాబు రివ్యూ

అక్టోబర్‌ 15న మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌  చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.  ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. మ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతం అందిచారు. చదవండి : ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement