చిన్న విరామం | Pooja Hegde allots dates to Akkineni Akhil | Sakshi
Sakshi News home page

చిన్న విరామం

Published Sat, Sep 7 2019 2:47 AM | Last Updated on Sat, Sep 7 2019 2:47 AM

Pooja Hegde allots dates to Akkineni Akhil  - Sakshi

అఖిల్‌, పూజా హెగ్డే

వరుస షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా ఉన్న అఖిల్‌ చిన్న విరామం తీసుకున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా ఫిక్స్‌ అయ్యారు.   ఇప్పటివరకూ జరిగిన షెడ్యూల్స్‌లో ఆమె పాల్గొనలేదు. వచ్చే వారంలో ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే కూడా పాల్గొంటారు. హీరో హీరోయిన్లపై కొన్ని లవ్‌ సీన్స్‌ ప్లాన్‌ చేశారట. ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్‌ స్వరకర్త. ఈ చిత్రం తర్వాత ‘అ!, కల్కి’ చిత్రాల ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటించే సినిమా మొదలవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement