మ్యూజిక్‌ ఓ హైలైట్‌: బొమ్మరిల్లు భాస్కర్‌ | Most Eligible Bachelor Song Launch | Sakshi
Sakshi News home page

మ్యూజిక్‌ ఓ హైలైట్‌: బొమ్మరిల్లు భాస్కర్‌

Published Tue, Feb 16 2021 12:26 AM | Last Updated on Tue, Feb 16 2021 12:26 AM

Most Eligible Bachelor Song Launch - Sakshi

గోపీ సుందర్, భాస్కర్‌, అఖిల్

అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్‌  19న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘గుచ్చే గులాబిలా..’ పాటను వేలంటైన్స్‌ డేకి రిలీజ్‌ చేశారు. గోపీసుందర్‌ స్వరపరచిన ఈ పాటను అనంత్‌ శ్రీరామ్, శ్రీమణి రచించారు. అర్మాన్స్‌  మాలిక్‌ ఆలపించారు. ఈ పాటకు విశేష స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. భాస్కర్‌ మాట్లడుతూ – ‘‘పాట సందర్భాన్ని వివరిస్తున్నప్పుడే గోపీసుందర్‌ ట్యూన్స్‌ ఇచ్చేశారు. మా సినిమాకు మ్యూజిక్‌ ఓ హైలెట్‌’’ అన్నారు. ‘‘భాస్కర్‌గారు కథ చెప్పిన విధానం నచ్చింది. అప్పుడే మంచి ట్యూన్స్‌ కట్టేశాం. మిగతా పాటలను కూడా అందరికీ త్వరగా వినిపించాలనుంది’’ అన్నారు గోపీసుందర్‌.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement