‘బొమ్మరిల్లు’ వంటి చక్కటి కుటుంబ కథా చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు భాస్కర్. ఆ సినిమాతో తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న వారిలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా చేరారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పరుగు’ సినిమా మంచి విజయం అందుకోగా, ‘ఆరెంజ్, ఒంగోలు గిత్త’ సినిమాలు నిరాశ పరచాయి. ఆ చిత్రాల తర్వాత ఆయన తెలుగు సినిమాలేమీ చేయలేదు. కానీ, తమిళంలో చేశారు. తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్‌తో భాస్కర్ ఓ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
గోపీచంద్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఆయన ఓ కథ రెడీ చేశారట. గోపి–భాస్కర్ కాంబినేషన్‌లో సినిమా నిర్మించేందుకు నిర్మాతలు కూడా రెడీ అట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వీరి కాంబినేషన్‌లో రానున్న సినిమా గోపీచంద్ తరహా యాక్షన్ నేపథ్యంలో ఉంటుందా? భాస్కర్ శైలిలో ఫ్యామిలీ, ప్రేమ నేపథ్యంలో ఉంటుందా? అన్న ఆసక్తికర చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. ఈ సినిమాతో పాటు అల్లు అరవింద్, డి.సురేశ్‌బాబు బ్యానర్లలో సినిమాలు చేసేందుకు కథలు సిద్ధం చేసుకుంటున్నారట భాస్కర్.
గోపీచంద్‌తో ‘బొమ్మరిల్లు’?
Published Wed, Mar 14 2018 12:18 AM | Last Updated on Wed, Mar 14 2018 12:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment