
వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి(మార్చి10)నుంచి ప్రారంభమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది.లాటరీ ద్వారానే హెచ్-1బీ వీసాలు అందజేస్తామని, కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఏప్రిల్ 1 నుండి దరఖాస్తులను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్
- దరఖాస్తుదారుడు యూఎస్‌సీఐఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు(రూ.729)ప్రతి దరఖాస్తుదారుడు చెల్లించాలి
- రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కు వర్కర్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందించాలి.
- ఎంపికైన దరఖాస్తుదారులు మాత్రమే హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేయడానికి అర్హులు.
కాగా హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంది. తద్వారా భారతీయులకు ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. గత ఏడాది యూఎస్‌సీఐఎస్‌కు సుమారు 2.67 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఇందులో 60 శాతానికి పైగా భారత్‌కు చెందినవారు. ఈ ఏడాది కూడా దాదాపు 70 శాతం అంటే సుమారు 60వేల వీసాలు భారతీయులకి దక్కనున్నాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment