
పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభం
నడిగూడెం: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గురువారం పారిశుద్ధ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ బర్మావత్ శంకర్ నాయక్, ఈఓఆర్డీ కొల్లు వైష్ణోయోగి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.