డీఎడ్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
డీఎడ్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
Published Wed, Jan 4 2017 10:37 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
రాజమహేంద్రవరం రూరల్ : క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి తెలిపారు. బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో జిల్లా స్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డైట్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఏఎస్‌ఈ (ట్రైనింగ్ కళాశాల) ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఐహెచ్‌జిఎన్ ప్రసాదు, ప్రభుత్వ మోడల్ హైస్కూలు హెచ్‌ఎం ఆర్.నాగేశ్వరరావు, జిల్లా ప్రైవేటు డీఎడ్ కళాశాలల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు డి.వి.సుబ్బరాజు, రాష్ట్ర ప్రైవేటు డీఎడ్ కళాశాలల సంఘ కార్యనిర్వాహక సభ్యుడు ఆర్.కె.విశ్వనాథరావు మాట్లాడారు. ఎంపీడీఓ ఎ.రమణారెడ్డి, తహసీల్దార్ జి.భీమారావు, ఎంఈఓ కె.నరసింహారెడ్డి, పీఈటీల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జీవన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా పోటీలు
తొలి రోజు బాలుర క్రీడా పోటీల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, బాల్ బ్యాడ్మింటన్, బాలికల విభాగంలో ఖోఖో, కబడ్డీ, చెస్, టెన్నికాయిట్, వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. సాంస్కృతిక విభాగంలో పాటలు, ఏకపాత్రాభినయం, నృత్య పోటీలు, సాహిత్య విభాగంలో వక్తృత్వం, వ్యాస రచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు.
Advertisement