మంగళవారం ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఆయన ప్రయాణించే ప్రగతి రథం బస్సు డ్రైవర్లు, మెకానిక్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 466 అంబులెన్స్, అమ్మ ఒడి, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి, 34 హర్సె వాహనాలు ఉన్నాయి.
అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన సభలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.
ఆశ కార్యకర్తలకు సెల్ ఫోన్ బిల్లు: హరీశ్‌రావు
తెలంగాణ ఏర్పడే నాటికి 108 అంబులెన్సులు 316 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 455కు పెరిగిందని హరీశ్‌రావు తెలిపారు. గతంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. ఇప్పుడు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచి్చందన్నారు. గతంలో అంబులెన్స్ చేరుకునే సగటు సమయం 30 నిమిషాలు ఉంటే.. ఇప్పుడది 15 నిమిషాలకు తగ్గిందని తెలిపారు. 108 ఉద్యోగుల వేతనాలు 4 స్లాబులుగా పెంచుతున్నామని చెప్పారు. అమ్మ ఒడి వాహనం ద్వారా రోజుకు 4 వేల మంది గర్భిణులకు, 108 ద్వారా రోజుకు 2 వేల మందికి సేవలు అందుతున్నాయని చెప్పారు. ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని, కొత్తగా హైదరాబాద్ పరిధిలో నియమితులైన ఆశాలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని అన్నారు.
ఆ ఒక్క శాతం లోపంతో చెడ్డపేరు
వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది 99 శాతం బాగా పనిచేస్తున్నప్పటికీ, ఒక్క శాతం లోపం వల్ల కూడా చెడ్డపేరు వస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కూడా లోపాలు మాత్రమే కాకుండా చేస్తున్న మంచిని కూడా చూపాలని కోరారు.బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయని చెప్పారు.ఆ పార్టీ రాష్ట్రాల్లో కొట్లాటలు, అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని హరీశ్‌రావు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment