ఉత్సాహంగా ఎడ్ల పోటీలు | state level bulls race | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎడ్ల పోటీలు

Published Wed, Oct 26 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

ఉత్సాహంగా ఎడ్ల పోటీలు

ఉత్సాహంగా ఎడ్ల పోటీలు

శోభనాద్రిపురం (హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌) : బాపులపాడు మండలంలోని శోభనాద్రిపురంలో రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ కేటగిరీల్లో నిర్వహిస్తున్న గూటీ లాగుడు పోటీలు తొలిరోజు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. తొలిరోజు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 16 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. 57 అంగుళాల ఎత్తులోపు ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎడ్ల పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తొలుత ఈ పోటీలను తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు పోటీలను ప్రారంభించారు. తెలుగురైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమావరప్రసాద్, తెలుగు యువత మండల అధ్యక్షుడు కలపాల సూర్యనారాయణ, నిర్వాహకులు చింతపల్లి సుమన్, మొవ్వా బోసు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement