
సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
కోదాడఅర్బన్: కోదాడ పట్టణంలోని 5వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణ పనులకు గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం పట్టణంలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పార సీతయ్య, ఎస్‌కె నయీం, షఫీ, ఖాజాగౌడ్, నాయకులు కుక్కడపు బాబు, కమదన చందర్‌రావు, కందరబోయిన వేలాద్రి, మున్సిపల్ డీఈ లక్ష్మానాయక్, శెట్టి భాస్కర్, వంటిపులి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.