పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేసిన లాంచీని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు
నాగార్జునసాగర్ : పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేసిన లాంచీని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన లాంచీలో మంత్రులతో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టూరిజం ఎండీ క్రిస్టియానా, బుద్ధ వనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, జీఎం మనోహర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పయనించారు. అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. నాగార్జునసాగర్‌కు అత్యధిక పర్యటకులు తెలంగాణ నుంచే వస్తారని అన్నారు. వారి సౌకర్యార్థం ఈ లాంచీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యడవెల్లి విజయేందర్‌రెడ్డి, బాలునాయక్, కర్నాటి లింగారెడ్డి, ఎం.సీ కోటిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి పాల్గొన్నారు.