వేద పరీక్షలు ప్రారంభం
రాజమహేంద్రవరం కల్చరల్ : స్థానిక ఇన్నీసుపేట హోతావారి వీధిలోని వేదశాస్త్ర పరిషత్ కార్యాలయంలో శనివారం వేదశాస్త్ర పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు వచ్చారు. తొలి రోజు యజుర్వేద పరీక్షలు జరిగాయి. ఆది, సోమవారాల్లో కూడా ఇదే విభాగంలో జరుగుతాయి. 23, 24 తేదీల్లో రుగ్వేదం, అధర్వణ వేదం, సామవేదాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రాజమహేంద్రవరం వేదశాస్త్ర పరిషత్ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి ఇచ్చే పట్టాలకు ఎంతో గుర్తింపు ఉంటుంది. ఇక్కడ పట్టాలు తీసుకున్న విద్యార్థులకు తిరుపతి వేద విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మంచి జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి.