
కొత్త సినిమా షూటింగ్ షురూ అంటున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఫర్హాద్ సామ్‌జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ‘కబీ ఈద్ కబీ దీవాలి’ (‘బాయిజాన్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
Salman Khan Venkatesh Starrer Kabhi Eid Kabhi Diwali Shoot Started: కొత్త సినిమా షూటింగ్ షురూ అంటున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఫర్హాద్ సామ్‌జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ‘కబీ ఈద్ కబీ దీవాలి’ (‘బాయిజాన్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మే 11న ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో ఆరంభించనున్నారు. ఇందు కోసం ఓ భారీ సెట్ వేశారు. ఈ షెడ్యూల్‌లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటారు. ఇక ఇటీవల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం ముంబైలో ఉంటున్న వెంకటేశ్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
విలన్‌గా..
దక్షిణాదిన తిరుగు లేని విలన్‌గా దూసుకెళుతోన్న జగపతిబాబు ‘కబీ ఈద్ కబీ దీవాలి’లో విలన్‌గా నటిస్తారనేది బీ టౌన్ టాక్. ఒకవేళ ఈ వార్త నిజమైతే హిందీలో జగపతిబాబుకి ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సినిమాను తొలుత వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్రయూనిట్ తెలిపింది.
చదవండి: ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు
అడల్ట్ సైట్‌లో ఫోటో లీక్, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి