![Is Venkatesh Playing Pooja Hegde Brother In Salman Khan Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/17/pooja.jpg.webp?itok=M8qV7stW)
అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం పూజా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫర్హద్ సామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేశ్ పూజాకు అన్నయ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కథలో వీరిద్దరి పాత్రలకు ఎంతో ప్రాధాన్యమున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఇటీవలె ఎఫ్-3లో వరుణ్ తేజ్, వెంకటేశ్‌తో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన పూజా ఈ సినిమాలో వెంకటేశ్‌కు చెల్లిగా ఎలా అలరించనుంది అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment