విశాఖ స్పోర్ట్స్: కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలకు చెందిన 23 టాప్ కమాండో బృందాలు పాల్గొనే 14వ ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్(ఏఐపిసిసి) సోమవారం విశాఖలోని ఏపీ గ్రేహౌండ్స్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను విశాఖ నగర సీపీ ఎ.రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి ప్రతిభ కలిగిన జట్టు విజయం సాధిస్తుందని, క్రీడాస్ఫూర్తితో తలపడాలన్నారు. ఏపీ గ్రేహౌండ్స్ అదనపు డీజీ రాజీవ్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోందన్నారు.
విశాఖలో 16 రాష్ట్రాల పోలీస్ కమాండో జట్లతో పాటు ఏడు పారామిలిటరీ దళాల కమాండో జట్లు ఐదు దశల్లో జరిగే పోటీల్లో పాల్గొంటాయన్నారు. జాతీయ సమగ్రతకు ఈ పోటీలు చక్కటి ఉదాహరణ అన్నారు. తొలుత అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ జట్టుతో ప్రారంభమై, ఉత్తరాఖండ్ జట్టు చివరగా మొత్తం 23 జట్లు గౌరవవందనం సమర్పించాయి. గ్రేహౌండ్ బ్యాండ్ మార్చ్‌పాస్ట్ అలరించింది. ఈ కార్యక్రమంలో ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ రాజీవ్‌కుమార్ సింగ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ చైర్మన్ ఏడీజీ అతుల్‌సింగ్, రేంజ్ ఐజీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment