ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం | eamcet counselling started | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Published Fri, Jun 9 2017 5:11 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

బాలాజీచెరువు (కాకినాడ) / రాజమహేంద్రవరం రూరల్‌ : ప్రభుత్వ,ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్‌–17 కౌన్సెలిం

-సందడి తగ్గిన కేంద్రాలు
-నేడు 8001 నుంచి 16,000 వరకూ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన

 
బాలాజీచెరువు (కాకినాడ) / రాజమహేంద్రవరం రూరల్‌ :  ప్రభుత్వ,ప్రైవేట్‌  ఇంజనీరింగ్‌ కళాశాలల్లో  ప్రవేశానికి ఏపీ  ఎంసెట్‌–17 కౌన్సెలింగ్‌ గురువారం కాకినాడలో జేఎన్‌టీయూకే, జగన్నాథపురంలోని ఆంధ్రా పాలిటెక్నిక్‌, భానుగుడి మహిళా పాలిటెక్నిక్‌, బొమ్మూరు జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రారంభమైంది. మహిళా పాలిటెక్నిక్‌లో 83, ఆంధ్రా పాలిటెక్నిక్‌లో 80, జేఎన్‌టీయూకేలో 83 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నారు. బొమ్మూరులో 229 మంది పరిశీలన చేయించుకున్నట్టు  ప్రిన్సిపాల్‌ వి.నాగేశ్వరరావు తెలిపారు. కౌన్సెలింగ్‌ కేంద్రాల వద్ద పరిశీలనకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపులో అభ్యర్థులకు కాస్త ఇబ్బందులు తప్పలేదు. చాలా మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చెల్లించే విధానం తెలియక నేరుగా డబ్బులు చెల్లించాలనుకున్నారు.

జిల్లావ్యాప్తంగా ఎస్టీ అభ్యర్థుల పత్రాల పరిశీలనకు  ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాలను నిర్ణయించగా పలువురు తెలియకజేఎన్‌టీయూకే కేంద్రానికి వెళ్లి ఇబ్బంది పడ్డారు.   కౌన్సెలింగ్‌ కేంద్రాల వద్ద ఈ ఏడాది సందడి కనిపించలేదు. గతంలో విద్యార్థులు, తల్లిదండ్రుల  రద్దీ  ఎక్కువగా ఉండడం, వారి సౌకర్యార్థం టెంట్‌లు, వాటర్‌ సదుపాయం కల్పించకపోవడంతో ఆందోళనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది కాకినాడలో ఏ కేంద్రం వద్దా వందకు మించి అభ్యర్థులు లేరు. శుక్రవారం 8001 నుంచి 16 వేల వరకూ ర్యాంకు గల  అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. అభ్యర్థులు ఎవరికైనా సందేహాలుంటే  95810 77666 నంబర్లో సంప్రదించవచ్చని కో ఆర్డినేటర్‌ దీక్షితులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement