సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సెంటర్ను డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ప్రారంభించారు.
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సెంటర్ను డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ప్రారంభించారు. దీని ద్వారా హైదరాబద్ పరిధిలోని 44 పోలీస్ స్టేషన్లలో సిబ్బంది పనితీరును ఒకేసారి పర్యవేక్షించే సదుపాయం కలుగుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 450 సీసీ టీవీ కెమెరాలను పోలీసు విభాగం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని 126 ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయనున్నట్లు అనురాగ్ శర్మ తెలిపారు.