
బేగంపేట నుంచి సంగారెడ్డిదాకా రోడ్డు మార్గంలోనే..
► జూన్ 1న రాహుల్ గాంధీ పర్యటన తీరిదీ..
► రూట్ మ్యాప్ విడుదల చేసిన ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: జూన్ 1న సంగారెడ్డిలో జరగనున్న సభ కోసం రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలోనే అక్కడికి వెళ్లనున్నారు. రాహుల్ పర్యటన రూట్‌మ్యాప్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో వెల్లడించారు.
1న ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహం దగ్గరకు చేరుకుని, పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ వద్ద కొద్దిసేపు ఆగి కార్యకర్తలను కలుస్తారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు ప్రాంతాల్లో కార్యకర్తలతో మాట్లాడటానికి కొద్దిసేపు ఆగుతారు. పటాన్‌చెరు నుంచి నేరుగా సంగారెడ్డికి వెళ్తారు. అక్కడ అతిథిగృహంలో పార్టీ ముఖ్య నేతలు, వివిధ వర్గాలకు చెందిన వారితోనూ రాహుల్ భేటీ అవుతారు.
సాయంత్రం 6 గంటలకు సభ: ‘తెలంగాణ ప్రజాగర్జన’ పేరుతో టీపీసీసీ నిర్వహిస్తున్న సభా వేదిక వద్దకు రాహుల్ సాయంత్రం 6 గంటలకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు సభ ముగుస్తుందని ఉత్తమ్ వెల్లడించారు. సంగారెడ్డిలో సభ పూర్తయిన తరువాత హైదరాబాద్‌కు చేరుకుని, రాహుల్ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారని వివరించారు.
మోసాన్ని ఎండగడ్తాం..: బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల మోసాలను, హామీల అమలులో వైఫల్యాలను సంగారెడ్డిలో జరిగే తెలంగాణ ప్రజాగర్జనలో ఎండగడ్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి కుంతియా, శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దానం నాగేందర్‌తో కలసి రాహుల్ పర్యటన రూట్‌మ్యాప్‌ను విడుదలచేసిన సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాల మోసాలపై ప్రజాగర్జనలో చార్జీషీటును విడుదల చేస్తామని ప్రకటించారు.