సాక్షి, సంగారెడ్డి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యువతకు టికెట్లు కేటాయించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. వరుసగా రెండు, మూడుసార్లు ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి టికెట్టు ఇవ్వొద్దని రాహుల్‌కు ఆయన సూచించారు. పార్టీకి ముఖ్యమైన వారికి నామినెటేడ్ పదవులు ఇవ్వండనీ, కానీ గెలిచే సత్తాలేని నాయకులకు మాత్రం టికెట్ ఇవ్వొద్దని కోరారు.
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న యువకులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలని జగ్గారెడ్డి లేఖలో అభిప్రాయపడ్డారు. యూత్ కాంగ్రెస్, ఓయూ జాక్ నుంచి టికెట్లు అడుగుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా కోసం కసరస్తు చేస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ లేఖను రాశారు.
Comments
Please login to add a commentAdd a comment