
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి
సంగారెడ్డి: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ దక్కేలా చూడాలని కార్యకర్తలను సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కోరారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, ఇంటింటి ప్రచారం చెయ్యాలని సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ దగ్గర డబ్బులున్నాయని, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరికి వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. జగ్గా రెడ్డి గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదన్నారు.
జగ్గా రెడ్డి కేసులకు భయపడుతున్నాడన్న, జగ్గారెడ్డి ఏటీఎంలు ఏమైనాయన్న హరీష్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. జగ్గారెడ్డి కేసులకు భయపడే వ్యక్తి కాదని, అలా భయపడితే గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వంపై పోరాడేవాడిని కాదన్నారు. అవును తాను ఆపదలో ఉన్నవారికి కచ్చితంగా ఏటీఎంనే అని, సంగా రెడ్డి ప్రజలకు కూడా ఆ విషయం తెలుసునన్నారు. తాను ఎంతమందికి ఆర్ధిక సహాయం చేశానో, హరీష్ రావు ఎంతమందికి సహాయం చేశారో చర్చకు సిద్ధమా అని హరీష్‌కు సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment