నేడు టీడీపీ – జనసేన ఉమ్మడి సభ.. లక్షల్లో గొప్పలు.. వేలుదాటని కుర్చీలు | TDP Jana Sena Joint meeting today | Sakshi
Sakshi News home page

నేడు టీడీపీ – జనసేన ఉమ్మడి సభ.. లక్షల్లో గొప్పలు.. వేలుదాటని కుర్చీలు

Published Wed, Feb 28 2024 5:03 AM | Last Updated on Wed, Feb 28 2024 6:07 AM

TDP Jana Sena Joint meeting today - Sakshi

నేడు టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు హాజరయ్యేవారు వేలల్లోనే

ఏడు ఎకరాల్లో వేదిక, రెండు హెలిప్యాడ్‌లు, వీఐపీ రెస్ట్‌ రూమ్‌లు

మిగతా 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు

ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు.. వచ్చేది 33 వేల మందే

సాక్షి, అమరావతి: పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసో­పాలు పడుతోంది. టీడీపీ – జనసేన ఉమ్మ­డిగా ప్రత్తి­పాడు వద్ద నేడు తలపెట్టిన తొలి సభను జనవాణి­నితో ఉప్పొంగిన ‘సిద్ధం’ సభలతో పోలుస్తూ చంకలు గుద్దుకుంటోంది.

చంద్రబాబు – పవన్‌ కోసం రెండు హెలి­ప్యాడ్లు, సేద తీరడం కోసం సభా ప్రాంగణంలో సగం స్థలంలో ఏర్పాట్లు చేశారని, అక్కడి మైదానంలో వేల మంది మాత్ర­మే కూర్చునే వీలుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్ని­కల సమరనాదంతో వైఎ­స్సార్‌­సీపీ భీమిలి, దెం­దు­లూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జన సము­ద్రాల­ను తలపించా­యి.  

మార్మోగుతున్న రణ నినాదం..
సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ భీమిలిలో గత నెల 27వతేదీన సిద్ధం తొలి సభను నిర్వహించారు. సీఎం జగన్‌ సమర శంఖం పూరించిన ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల మందికిపైగా కార్యకర్తలు, అభి­మా­నులు పోటెత్తారు. సిద్ధం రెండో సభను ఈనెల 3న ఏలూరు సమీపంలో దెందులూరు వద్ద నిర్వహించారు.

వేదికపోనూ కార్యకర్తలు, అభిమానులు కూర్చొని సభను వీక్షించడానికి 110 ఎకరాల మైదానంలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 50 నియోజకవర్గాల నుంచి 6 – 7 లక్షల మందికి­పైగా ఈ సభకు తరలి­వచ్చారు. ఇక రాప్తాడు­లో నిర్వహించిన ‘సిద్ధం’ మూడో సభకు వేదిక­పోనూ ప్రజల కోసం ఏకంగా 250 ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాట్లు చేశారు.

ఈ సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల పరి«ధిలోని 52 నియోజకవర్గాల నుంచి 10 నుంచి 11 లక్షల మంది హాజరయ్యారు. ఉమ్మ­డి రాష్ట్రం,  తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజా­సభగా రాప్తాడు సిద్ధం సభ నిలిచిందని రాజ­కీయ విశ్లేషకులు స్పష్టం చేశా­రు. సీఎం జగన్‌ నాయకత్వంపై కార్యక­ర్తలు, అభిమానులు, ప్రజలకు ఉన్న విశ్వాసా­నికి ‘సిద్ధం’ సభలు నిదర్శనమని విశ్లేషిస్తు­న్నారు.  

స్థైర్యం నింపేందుకు పాట్లు...
జనసేన 24 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రెండు పార్టీల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ‘సిద్ధం’ సభలు ఒకవైపు ప్రకంపన­లు సృష్టిస్తుండగా మరోవైపు టీడీపీ – జనసేన­లో భగ్గుమన్న విభేదాలతో క్యాడర్‌ చెల్లాచె­దురైంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీడీపీ–­జనసేన శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఎల్లో మీడియా తంటాలు పడుతోంది. 

మొత్తం 33 వేల కుర్చీలు
టీడీపీ–జనసేన నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభకు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపా­డు వద్ద జాతీయ రహదారి బైపాస్‌ పక్కనే ఉన్న 22 ఎకరాల మైదానాన్ని ఎంచుకున్నారు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చే రెండు పార్టీల నేతలు సుమారు 500 మంది కూర్చో­వ­డా­నికి వీలుగా వేదికతోపాటు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు వేర్వేరుగా హెలికాఫ్టర్‌లలో రానుండటంతో అక్కడకు సమీపంలో రెండు హెలీ­ప్యా­డ్‌లు ఏర్పాటు చేశారు.

వేదిక, హెలి ప్యాడ్‌లు, వీవీఐపీల రెస్ట్‌ రూమ్‌ల నిర్మాణానికి ఏడు ఎకరాలు పోగా మిగిలిన 15 ఎకరాల్లో కార్య­­కర్తల కోసం 22 గ్యాలరీలు సిద్ధం చేశా­రు. ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు వేస్తు­న్న­ట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంటే 22 గ్యాల­రీల్లో 33 వేల కుర్చీలు పట్టే అవకాశం ఉంది.

మొత్తం కుర్చీలన్నీ నిండిపోయి 15 ఎకరాల ప్రాంగణం కిక్కిరిసిపోతే దాదాపు 60 వేల మంది హాజరైనట్లు లెక్క అని పరిశీ­లకు­లు స్పష్టం చేస్తున్నారు. ఇలా వేల మంది మాత్ర­మే హాజరయ్యే సభలను జన సముద్రా­లతో పోల్చ­డం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సభకు ఓ నమస్కారం!
సాక్షి, భీమవరం: టీడీపీ – జనసేన ఉమ్మ­డిగా నిర్వహిస్తున్న తొలిసభ ‘తెలుగు జన­జెండా’కు అసమ్మతి సెగ తగిలింది. పొత్తు­ల పేరుతో 24 సీట్లకే పవన్‌ కళ్యాణ్‌ ఒప్పు­కో­వడంపై జనసేన నేతలు మండిపడు­తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా­లకు చెందిన నేతలు, శ్రేణులు ఈ సభకు ముఖం చాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సభా ప్రాంగణం, ఏర్పాట్ల విషయంలో రెండు పార్టీల నేతల మధ్య సమన్వ­యం కొర­వ­డటంతో ఎవరికివారే అన్నట్లు వ్యవ­హ­రిస్తున్నారు.

సభ ఏర్పా­ట్లను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ వద్ద తణుకు నియోజకవర్గ ఇన్‌­చార్జి విడివాడ రామ­చంద్రరావు నిరసన గళం వినిపించారు. తణుకులో ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి నిర్వ­హించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శివ­రామరాజును పిలవకపోవడంతో ఆయన వర్గీయులు హాజరు కాలేదు.

కొత్తపేటలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాసరావు, ఆయన అనుచరులు డుమ్మా కొట్టారు. మండపేటలో ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మె­ల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ప్రకటించడంపై జనసేన ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణ గుర్రుగా ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ సీటు కందుల దుర్గేష్‌కు సీటు కేటాయించపోవడంతో సభకు దూరంగా ఉండాలని ఆయన వర్గం భావిస్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement