
అమిత్‌షా బహిరంగ సభను జయప్రదం చేయాలి
వరంగల్‌లో ఈనెల 17న నిర్వహించే బీజేపీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య పిలుపునిచ్చారు.
కట్టంగూర్
వరంగల్‌లో ఈనెల 17న నిర్వహించే బీజేపీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండలకేంద్రంలో సభకు సంబంధించిన కరపత్రాలను ఆ పార్టీ మండల నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, బూతుస్థాయి అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆపార్టీ మండల అధ్యక్షుడు మండల వెంకన్న, కోమటి భాస్కర్, కటికం శ్రీను, పాదూరి వెంకట్‌రెడ్డి, వీరమళ్ల శంకర్, పల్స సైదులు, గుండు వెంకన్న, శంకర్ ఉన్నారు.