Updates:
12:36PM, Mar 5th, 2024
ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన..
- బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రధానికి వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం
- రెండురోజుల తెలంగాణ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ
12:26PM, Mar 5th, 2024
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య స్కాముల బంధం గట్టిది: ప్రధాని
- తెలంగాణలో బీఆర్‌ఎస్ కుంభకోణాలు చూసి ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు
- అయితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య కుంభకోణాల బంధం బలంగా ఉంది
- కాళేశ్వరంలో బీఆర్‌ఎస్ దోచుకుంటే విచారణ పేరుతో కాంగ్రెస్ దోచుకుంది.
- కాంగ్రెస్ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది
- కాంగ్రెస్ సర్కారు ఆటలు ఎక్కువ కాలం సాగవు
- మోదీ సర్కారులో ఎయిర్ దాడులు కూడా ఉంటాయి
12:10PM, Mar 5th, 2024
కుటుంబవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నా : ప్రధాని మోదీ
- జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీలున్న చోట కుటుంబాలు బాగుపడ్డాయి.
- కుటుంబవాద పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు
- పరివార వాదులకు చోరీ చేసేందుకు లైసెన్స్ ఉందా
- వాళ్లకు కుటుంబం ఫస్ట్... నాకు దేశం ఫస్ట్
- కాంగ్రెస్ బయటివారికి ఎవరికీ అవకాశం ఇవ్వదు
- కుటుంబవాదులు సొంత ఖజానా నింపుకున్నారు.
- మోదీ దేశఖజానా నింపాడు
- నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు.
- కుటుంబవాదులు మోదీపైనే దాడి చేస్తున్నారు
- దేశంలో ప్రతి తల్లి, సోదరి, యువకులు, పిల్లలందరూ మోదీ కుటుంబమే
- ఇందుకు అందరూ మోదీకా పరివార్ అని అంటున్నారు
- నేను మోదీ కుటుంబం అని తెలంగాణ ప్రజలంటున్నారు
- తెలంగాణప్రజల కలలు.. నా సంకల్పం
- ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశంలో గత 70 ఏళ్లలో జరగలేదు
- నేను గ్యారెంటీ వ్యక్తిని.. గ్యారెంటీ పూర్తి చేయడం నాకు తెలుసుఘె
- ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశాం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
- ఇవాళ రెండోరోజు తెలంగాణ ప్రజలతో ఉండటం సంతోషం
- సంగారెడ్డి నుంచి రూ. 7వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభిస్తున్నాం
- ఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది
- పదేళ్లలో దేశంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య రెట్టింపు అయింది
- వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది
- దేశంలో తొలి ఎవియేషన్ సెంటర్‌ను బేగంపేటలో ఏర్పాటు చేశాం
- ఘట్‌కేసర్- లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ ప్రారంభించాం
పటాన్‌చెరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమాలు
- NH-65 లోని పుణే - హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి X రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణ (1,298 కోట్లు)
- NH-765Dలో 399 కోట్లతో మెదక్ - ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ
- NH-765Dలో 500 కోట్లతో ఏల్లారెడ్డి - రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులు
- జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు (b) పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లు
- NH-161 లోని కంది - రామసానిపల్లె సెక్షన్ లో 4 వరుసల జాతీయ రహదారి (1,409 కోట్లు)
- NH-167 లోని మిర్యాలగూడ - కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ (323 కోట్లు)
- హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో 103 కి.మీ.ల పొడవున చేపట్టిన MMTS ఫేజ్ - II ప్రాజెక్ట్ (1,165 కోట్లు)
- ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలు ప్రారంభం
తక్కువ చార్జీలకే హైదరాబాద్ ప్రయాణ సౌకర్యం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది
- ఘట్‌కేసర్-లింగంపల్లి మధ్య అందుబాటులోకి కొత్త ఎంఎంటీఎస్
- ఇవాళ రూ.9 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు
- గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసింది.
- తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.
- జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు
- ఎరువుల సబ్సిడీ కోసం రూ. 33 వేల కోట్లు
- రైల్వేల అభివృద్ధి కోసం రూ. 35 వేల కోట్లు.
- రేషన్ సబ్సిడీపై రూ. 30 వేల కోట్లు,
- ఉపాధి హామీ పథకం కింద రూ. 26,728 కోట్లు.
- రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం రూ. 10,998 కోట్లు.
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 10 వేల కోట్లు.
- సర్వశిక్షా అభియాన్ కింద రూ. 7,500 కోట్లు.
- గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం రూ. 7,200 కోట్లు
- రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం రూ. 6,338 కోట్లు.
- ఎల్పీజీ సబ్సిడీ కింద రూ. 5,859 కోట్లు
- హెల్త్ మిషన్ కింద రూ. 5,550 కోట్లు.
- ప్రధానమంత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం రూ. 4,500 కోట్లు
- స్వచ్ఛ భారత్ కింద రూ. 3,745 కోట్లు..
- ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎయిమ్స్.. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేసింది.
- బీఆర్ఎస్ పార్టీ కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వడం లేదంటూ బురదజల్లుతోంది.
- కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారు.
11:00AM, Mar 5th, 2024
- పటేల్‌గూడలోని ఎస్‌ఆర్ ఇన్‌ఫినిటీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
10:40AM, Mar 5th, 2024
- బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
- కాసేపట్లో సంగారెడ్డికి వెళ్లనున్న మోదీ
- పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న మోదీ
10:30AM, Mar 5th, 2024
- ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ప్రధాని మోదీ
10:20AM, Mar 5th, 2024
- సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు
- మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
- ప్రధాని మోదీ పూజలు చేసే సమయంలో ఆలయం లోపలికి ఇద్దరికి మాత్రమే అనుమతి
- దేవాలయం చుట్టూ వెయ్యిమంది పోలీసులతో సెక్యూరిటీ
- అమ్మవారి దర్శనం అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని
#WATCH | Telangana: Prime Minister Narendra Modi visits and offers prayers at Ujjaini Mahankali temple in Secunderabad. pic.twitter.com/zijxd4LYAX
— ANI (@ANI) March 5, 2024
10:06AM, Mar 5th, 2024
- సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ప్రధాని
9:50AM, Mar 5th, 2024
- కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు తెలంగాణ పర్యటన షెడ్యూల్
- రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు
- బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి పఠాన్ చెరువు బయలుదేరనున్న ప్రధాని
- పఠాన్ చెరువులో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని
- పఠాన్ చెరువు బహిరంగ సభలో మాట్లాడనున్న ప్రధాని
సభకు ఏర్పాట్లు పూర్తి.. భారీగా బందోబస్తు
ప్రధాని సభ కోసం పటాన్‌చెరులోని పటేల్‌గూడ సభా వేదిక వద్ద 23 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లు, కాషాయ జెండాలతో నింపేశారు. అధికారిక కార్యక్రమాల కోసం ఒకటి, రాజకీయ ప్రసంగం కోసం మరొకటి.. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాని ముందుగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత బహిరంగ సభా వేదికపై ప్రసంగిస్తారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్‌సభ సీట్లతోపాటు సమీపంలోని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేలా ప్రధాని సభను నిర్వహిస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఉజ్జయని మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు.
వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న కార్యక్రమాలివీ..
► రూ.1,298 కోట్లతో ఎన్‌హెచ్–65పై సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరణ
► రూ.399 కోట్లతో ఎన్‌హెచ్–765డిపై మెదక్–ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే విస్తరణ. జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివీ..
► రూ.3,338 కోట్లతో నిర్మించిన పారాదీప్– హైదరాబాద్ గ్యాస్ పైప్‌లైన్
► రూ.400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
► రూ.1,409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్–161లోని కంది–రామసానిపల్లె సెక్షన్‌లో 4 వరుసల జాతీయ రహదారి
► రూ.323 కోట్ల ఖర్చుతో చేసిన ఎన్‌హెచ్–167 మిర్యాలగూడ–కోదాడ సెక్షన్ జాతీయ రహదారి విస్తరణ
► రూ.1,165 కోట్లతో హైదరాబాద్–సికింద్రాబాద్‌లలో 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్–2 ప్రాజెక్టు.
► ఘట్‌కేసర్– లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment