
శివ జొన్నలగడ్డ
‘పోలీస్ పవర్’ ఫేమ్ శివ జొన్నలగడ్డ హీరోగా సభ, లిఖిద హీరోయిన్స్‌గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సురేష్ రెడ్డి అక్కలను దర్శకునిగా పరిచయం చేస్తూ వసుంధర సమర్పణలో టి. రమేష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ‘పోలీస్ పవర్’ నిర్మాత గుద్దేటి బసవప్ప కెమెరా స్విచ్చాన్ చేయగా, జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ప్రసన్నకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘నా చిత్రాలకు దర్శకత్వశాఖలో పని చేసిన నా శిష్య బృందం అంతా కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నా’’ అన్నారు. ‘‘క్రైమ్, లవ్, రొమాన్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ నెల రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు సురేష్ రెడ్డి అక్కల. శివరాం నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌కుమార్, సంగీతం: సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ మట్టా.
Comments
Please login to add a commentAdd a comment