నాన్న డ్యూటీలో అమీర్ఖాన్ బిజీ.. బిజీ!
అమీర్ ఖాన్ ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్నారు. సినిమాలు ఎక్కువైపోవడం వల్ల అనుకుంటున్నారా.. కాదు. కొడుకును ఎత్తుకుని తిప్పడం, వాడి బాగోగులు చూసుకోవడం లాంటి డ్యూటీల్లో బాగా బిజీ అయిపోయాడు. ఎందుకంటే, అమీర్ భార్య కిరణ్ త్వరలో బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్కు వెళ్లనుంది. ఆ సమయంలో వాళ్ల కొడుకు ఆజాద్ తన తండ్రితోనే ఉండబోతున్నాడు. కొన్నేళ్ల క్రితం దంపతులిద్దరూ కలిసే బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్కు వెళ్లారు. ఈసారి మాత్రం కిరణ్ ఒక్కరే వెళ్తున్నారు.
నాన్న పనులు చేయడం తనకు చాలా ఇష్టమని, అసలు అందుకోసమే కిరణ్ను తాను అక్కడికి, ఇక్కడికి పంపుతున్నానని అమీర్ ఖాన్ చెప్పారు. రాబోయే రెండు వారాల పాటు ఆమె ఊళ్లో ఉండదు కాబట్టి ఆజాద్ తనతోనే ఉంటాడని తెలిపారు. వాళ్ల అమ్మ లేనప్పుడు మాత్రమే ఆజాద్ తనవద్దకు వస్తాడని, లేకపోతే అస్సలు లెక్కచేయడని అమీర్ అన్నారు. దాంతో.. ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకుండా కొడుకును దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట ఈ మిస్టర్ పెర్ఫెక్ట్.