చంఢీగఢ్: కులతత్వం, మతం ద్వారా దేశంలోని దేశభక్తిని అణిచివేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. హర్యానా అసెంబ్లీఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం పాల్వాల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారాయాన.
‘‘దేశానికి ముఖ్యమైన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ చిక్కుల్లో పెట్టింది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ అనుమతించలేదు. జమ్ము కశ్మీర్‌లో రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదు. మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీలో రిజర్వేషన్లు లేకుండా చేశారు. కాంగ్రెస్ ముస్లిం సోదరీమణులను ట్రిపుల్ తలాక్ సమస్యను పరిష్కరించలేదు. దేశ ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్యలను పరిష్కరించలేదు. బదులుగా సొంత కుటుంబాన్ని మాత్రం అభివృద్ధి చేసుకుంది.
#WATCH | Palwal, Haryana: Prime Minister Narendra Modi says, "Congress wants to destroy patriotism from this country. Congress feels that the stronger the feeling of unity among the people of the country, the more impossible it will be for Congress to win. That is why Congress is… pic.twitter.com/V2d0BwKHUV
— ANI (@ANI) October 1, 2024
కాంగ్రెస్ నేటికీ ఎన్నో పాపాలు చేసి..ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలు కంటోంది. బీజేపీ మద్దతుదారులు దేశభక్తులు. దేశభక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కులతత్వాన్ని ప్రచారం చేయడం ద్వారా, ఒక వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గాన్ని రెచ్చగొటట్టం ద్వారా దేశభక్తిని అణిచివేయాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉందని, ఇక ప్రజలు తమకు అధికారం అప్పగిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మధ్యప్రదేశ్ విషయంలోనూ ఇదే విధంగా అపోహ పడింది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment