చండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాజాగా మరోసారి 30 రోజుల పెరోల్ లభించింది. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసుల్లో బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 2017లో తీర్పు వెలువడి నాటి నుండి ఆయన హర్యానాలోని రోహ్‌తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్షాకాలంలో తరచుగా పెరోల్ పై వెళ్తూ రావడం చేస్తున్నారు. గడిచిన మూడేళ్ళలో బాబా గుర్మీత్ మొత్తం ఆరు సార్లు బయటకు వెళ్లి రాగా ఇది ఏడో సారి కావడం గమనార్హం.
జనవరిలో చివరిసారిగా పెరోల్ పై వచ్చిన డేరా బాబా సుమారు 40 రోజులు బయట గడిపారు. ఆ వ్యవధిలో బాబా ఆన్లైన్ లో సత్సంగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అదే సమయంలో తన పుట్టినరోజు వేడుకల్లో కత్తితో కేకును కట్ చేసి ఐదేళ్ల తర్వాత ఇలా పుట్టినరోజుని జరుపుకుంటున్నానని ఇలాంటి పుట్టినరోజులు కనీసం అయిదు జరుపుకోవాలని వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు.
హర్యానా ముఖ్యమంత్రి కూడా ఆరోజు మాట్లాడుతూ బాబా బెయిల్ గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఆయన బెయిల్ పై వచ్చినా కూడా అది పద్దతి ప్రకారమే జరుగుతుంది కదా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలు తిరగకుండానే మళ్ళీ అతడికి బెయిల్ మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డేరా బాబా విషయంలో కోర్టుకు హర్యానా ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.
ఇది కూడా చదవండి: అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు..
Comments
Please login to add a commentAdd a comment