Dera chief Gurmeet Ram Rahim Singh
-
డేరా బాబాకు మరోసారి పెరోల్
న్యూఢిల్లీ: డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరు అయింది. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో దోషి అయిన గుర్మిత్ శుక్రవారం మరోసారి మంజూరైన పెరోల్‌పై 50 రోజుల పాటు జైలు నుంచి విడుదల కానున్నారు. అయన ఇప్పటికే పలుమార్లు పెరోల్‌పై విడుదలైన విషయం తెలిసిదే. అయితే తాజాగా మంజూరైన పెరోల్తో ఆయన ఇప్పటివరకు గడిచిన రెండేళ్లలో ఏడోసారి కాగా, మొత్తంగా గడిచిన నాలుగేళ్లలో తొమ్మిదోసారి జైలు నుంచి పెరోల్‌పై బయటకు కావటం గమనార్హం. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసుల్లో బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 2017లో తీర్పు వెలువడి నాటి నుండి ఆయన హర్యానాలోని రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్షాకాలంలో తరచుగా పెరోల్‌పై వెళ్తూ రావడం చేస్తున్నారు. చదవండి: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ -
డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ..
చండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాజాగా మరోసారి 30 రోజుల పెరోల్ లభించింది. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం, ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసుల్లో బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 2017లో తీర్పు వెలువడి నాటి నుండి ఆయన హర్యానాలోని రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే శిక్షాకాలంలో తరచుగా పెరోల్ పై వెళ్తూ రావడం చేస్తున్నారు. గడిచిన మూడేళ్ళలో బాబా గుర్మీత్ మొత్తం ఆరు సార్లు బయటకు వెళ్లి రాగా ఇది ఏడో సారి కావడం గమనార్హం. జనవరిలో చివరిసారిగా పెరోల్ పై వచ్చిన డేరా బాబా సుమారు 40 రోజులు బయట గడిపారు. ఆ వ్యవధిలో బాబా ఆన్లైన్ లో సత్సంగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అదే సమయంలో తన పుట్టినరోజు వేడుకల్లో కత్తితో కేకును కట్ చేసి ఐదేళ్ల తర్వాత ఇలా పుట్టినరోజుని జరుపుకుంటున్నానని ఇలాంటి పుట్టినరోజులు కనీసం అయిదు జరుపుకోవాలని వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. హర్యానా ముఖ్యమంత్రి కూడా ఆరోజు మాట్లాడుతూ బాబా బెయిల్ గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఆయన బెయిల్ పై వచ్చినా కూడా అది పద్దతి ప్రకారమే జరుగుతుంది కదా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలు తిరగకుండానే మళ్ళీ అతడికి బెయిల్ మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డేరా బాబా విషయంలో కోర్టుకు హర్యానా ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇది కూడా చదవండి: అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు.. -
డేరా బాబాకు కరోనా పాజిటివ్.. ఆసుపత్రికి తరలింపు
గురుగ్రామ్: డేరాబాబాగా ప్రసిద్ధి చెందిన వివాదాస్పద గురువు , డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలిన డేరాబాబాను గురుగ్రామ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా మూడురోజుల క్రితం ఆయనకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో రోహతక్‌లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రికి తరలించి సిటీస్కాన్ పరీక్షలు చేయించిన సంగతి తెలిసిందే. తన ఆశ్రమంలోని ఇద్దరు సాద్విలపై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అప్పటి నుంచి ఆయన హర్యానాలోని రోహ్తక్లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. చదవండి: దేశ రాజధానిలో భారీగా తగ్గిన కరోనా కేసులు -
డేరా బాబా ‘విల్లా’సం
సాక్షి, సిర్సా : డేరా బాబా బాగోతాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హరియాణాలోని సిర్సాలో 700 ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి తొంగిచూసిన మీడియా బృందాలకు విస్తుగొలిపే దృశ్యాలు ఎదురవుతున్నాయి. గుర్మీత్ అత్యంత విలాసవంత జీవితం గడిపాడని అక్కడి కళ్లుచెదిరే భవంతులు, రాజప్రాసాదాలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. డేరా బాబా కలర్‌ఫుల్ లైఫ్ ఆ ప్రాంగణంలో అడుగడుగునా కనిపిస్తోంది. ఇప్పటికే ఈఫిల్ టవర్, తాజ్‌మహల్, డిస్నీలాండ్ నమూనాలను ప్రాంగణంలో కనుగొంటే తాజాగా స్పోర్ట్స్ విలేజ్, డేరా బాబా సినిమాలు ప్రదర్శించే మహి సినిమా థియేటర్ మీడియా కంటపడ్డాయి. ఈ థియేటర్లో ప్రస్తుతం గుర్మీత్ నటించిన జట్టు ఇంజనీర్ ప్రదర్శితమవుతోంది. ఎంఎస్‌జీ ఫుడ్ పార్టీ పేరుతో రెస్టారెంట్, సెవెన్ స్టార్ స్పా, మహిళల కోసం జిమ్, స్విమ్మింగ్ పూల్‌లు డేరా బాబా లగ్జరీ లైఫ్‌కు అద్దం పడుతున్నాయి. మహిళలు, యువతులతో గడిపేందుకు గుర్మీత్ ఏకాంత మందిరం ఎక్కడ ఉందో ఆరా తీస్తున్న మీడియా బృందానికి మరో కట్టడం తారసపడింది. స్విమ్మింగ్ పూల్ పక్కనే అయ్యగారి నిర్వాకాలకు పరాకాష్ట వంటి అద్భుత కట్టడం కనిపించింది. విదేశీ అనుచరుల కోసం డేరా బాబా ఏకంగా ఇక్కడ అండర్ వాటర్ విల్లా నిర్మిస్తున్నారు. అద్భుత ఇంజనీరింగ్ ప్రమాణాలతో నీటిలోపల భారీ రిసార్ట్‌ను నిర్మించేందుకు బాబా చేసిన ప్లాన్ ఆయన అరెస్ట్‌తో అటకెక్కింది. పోలీసులు ఇంకా డేరా బాబా ప్రాంగణంలో పూర్తిస్ధాయి సోదాలు చేపట్టలేదు. డేరా ప్రాంగణంలో త్వరలోనే పోలీసులు తనిఖీలు చేపడుతున్న క్రమంలో మరిన్ని అంశాలు వెలుగులోకి రానున్నాయి. -
డెరా బాబా ఖైదీ నెంబర్. 1997
లగ్జరీ లైఫ్‌ను, ప్రభుత్వం హైలెవల్ సెక్యురిటీని ఇన్నిరోజులు ఫుల్‌గా ఎంజాయ్ చేసిన డెరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇక జైల్లో ఊసలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు మహిళలపై అత్యాచార కేసులో గుర్మీత్ సింగ్‌కు ఇరవై ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్ నేడు(సోమవారం) శిక్షను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు రెండు జతల జైలు బట్టలను అందించారు. ఖైదీ నెంబర్. 1997ను గుర్మీత్‌కు కేటాయించి, సెల్‌లోకి తరలించారు. ఇన్నాళ్లూ కళ్లుమిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా నేటి శిక్ష ఖరారుతో మరో 20 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే. 20 ఏళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పును చదివిన వెంటనే, గుర్మీత్ రామ్ అక్కడిక్కడే కూలబడిపోయినట్టు బోరున విలపించారు. రెండు చేతులు జోడించి, తనను క్షమించి శిక్ష తగ్గించమని జడ్జిని వేడుకున్నారు. తాను అమాయకుడని, సామాజిక కార్యకలాపాలను చేస్తున్న నేపథ్యంలో తనను కరుణించాలని కోరుకున్నారు. అయితే గుర్మీత్ వేడుకను జడ్జి తోసిపుచ్చారు. నమ్మివచ్చిన సాధ్వీపై ఇలా అత్యాచారానికి పాల్పడటం క్షమించరాని నేరమని జడ్జి పేర్కొన్నారు. ఒక్కో కేసుకు పదేళ్ల చొప్పున, 20ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సిందేనని జడ్జి తీర్పునిచ్చారు. అంతేకాక రూ.30 లక్షల జరిమానాను కూడా గుర్మీత్‌కు విధించారు. గుర్మీత్‌ను సాధారణ ఖైదీలాగానే చూడాలన్న జడ్జి, రోహతక్ జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఐపీలాగ గుర్మీత్‌ను చూడటంపై అధికారులను మందలించారు. రేపిస్టులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తారా అంటూ జైలు అధికారులకు చివాట్లు పెట్టారు. గుర్మీత్ వేసిన శిక్షపై అటు బాధితులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరింత కఠినంగా శిక్ష విధించాలని వారు కోరుతున్నారు. గుర్మీత్‌కు విధించిన శిక్షను పలు పార్టీలు స్వాగతించాయి. అటు సీబీఐ తీర్పుపై సవాల్ చేసేందుకు గుర్మీత్ లాయర్లు సిద్ధమయ్యారు. శిక్ష ఖరారు సందర్భంగా కూడా కోర్టులో బాబాకు అనుకూలంగా గట్టివాదనలే వారు వినిపించారు.