
గురుగ్రామ్: డేరాబాబాగా ప్రసిద్ధి చెందిన వివాదాస్పద గురువు , డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలిన డేరాబాబాను గురుగ్రామ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా మూడురోజుల క్రితం ఆయనకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో రోహతక్‌లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రికి తరలించి సిటీస్కాన్ పరీక్షలు చేయించిన సంగతి తెలిసిందే.
తన ఆశ్రమంలోని ఇద్దరు సాద్విలపై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అప్పటి నుంచి ఆయన హర్యానాలోని రోహ్‌తక్‌లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.
చదవండి: దేశ రాజధానిలో భారీగా తగ్గిన కరోనా కేసులు
Comments
Please login to add a commentAdd a comment